Poonam Kaur.. హీరోయిన్ గా పూనమ్ కౌర్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చేవి.. కానీ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ పేర్లతో ఈ అమ్మడు భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే సినిమాలలో ఈ మధ్యకాలంలో తక్కువగా కనిపించినా.. పొలిటికల్ పరంగా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా వైసిపి నేత విజయసాయి రెడ్డి పైన పూనమ్ కౌర్ మరో ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటి గురించి చూద్దాం.
శాంతి, విజయ సాయి రెడ్డి పైన రూమర్స్..
గత మూడు రోజుల నుంచి దేవాదాయ శాఖ కమీషనర్ శాంతి పైన వైసిపి నేత విజయసాయి రెడ్డి పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ అంతకుముందే దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి కూడా మీడియా ముందుకు వచ్చి తన మొదటి భర్త మదన్మోహన్ తో విడాకులు తీసుకున్న తర్వాతే సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అతడితోనే బిడ్డను కన్నా అని కూడా తెలియజేయడం జరిగింది.
అక్రమ సంతానం అంటూ కామెంట్..
కానీ కొన్ని మీడియా రాతలు మాత్రం విజయసాయిరెడ్డి తోనే పిల్లలు కనింది అన్నట్టుగా అక్రమ సంతానం అనే విధంగా ముద్ర వేస్తున్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన గూండాలు ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని విజయసాయిరెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి వారికి తన దమ్ము ఏంటో చూపిస్తానంటూ కూడా ఒక సవాలు విసిరారు విజయసాయిరెడ్డి.. అసత్య వార్తలను రాసే వారికి తన వ్యక్తిగతంగా కూడా పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా తెలియజేశారు. ఈ విషయంలో తన సొంత పార్టీ వాళ్లు ఉన్నా సరే వదిలిపెట్టనంటూ తెలియజేశారు.
విజయసాయిరెడ్డి కి అండగా పూనమ్ కౌర్..
ఇలాంటి అసత్యాలు చేసే వారిని వదిలిపెట్టను అంటూ కూడా విజయ్ సాయి రెడ్డి కాస్త ఘాటుగానే ఫైర్ అయ్యారు.. అయితే ఈ విషయం పైన హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా స్పందిస్తూ.. తన మద్దతు విజయసాయిరెడ్డి కే అంటూ తెలియజేసింది.. విజయసాయి రెడ్డి గారు మీ ధైర్యానికి నేను మెచ్చుకోవాలి.. టీవీ ఛానల్ బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థల్లా మారిపోయాయని.. తన విషయంలో కూడా ఇలాంటి ఒక డ్రామానే నడిపించారు అంటూ తెలిపింది.. ప్రెగ్నెంట్ అయిందని, డబ్బులు తీసుకుందని, పని కోసం ఇలా చేసిందని చాలామంది చూపించడం జరిగింది.. మనం ఏడిస్తే, కన్నీరు కారిస్తేనే అది కొన్ని టీవీ వాళ్లకు విజయంగా అవుతుంది.. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు ఎక్కడా కూడా తలవంచకండి అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా పూనమ్ కౌర్ చేసిన ట్విట్ రాజకీయాలలోనే హాట్ టాపిక్ గా మారిపోతోంది. మరి ఈ విషయం ఇప్పుడు ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి మరి.
Be brave ✊ pic.twitter.com/tB2JlsYMol
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 15, 2024