IIFA Awards 2024 : 2024లో ఐఫా ఉత్సవాలను ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారత సినిమా సాధించిన విజయాలను గుర్తిస్తూ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలను ప్రదర్శిస్తూ, IIFA ఉత్సవం ఈ నాలుగు గౌరవనీయమైన రంగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే వేదికగా పని చేస్తుంది. టాలెంట్ ఉన్న నటినటులను, దర్శకులను, మ్యూజిక్ దిగ్గజాలను అవార్డులి ఇచ్చి సత్కరించడమే కాకుండా, పలువురు సెలబ్రిటీల అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్. అయితే ఈసారి జరగబోతున్న ఐఫా ఉత్సవాల్లో టాలీవుడ్ తరపున గా ఓ పాన్ ఇండియా హీరో హోస్ట్ గా వ్యవహరించబోతున్నారనే వార్త తాజాగా బయటకొచ్చింది.
ఐఫా తెలుగు హోస్ట్ గా పాన్ ఇండియా హీరో
2024 సెప్టెంబర్ 7, 8వ తేదీలలో అబుదాబిలోని యస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ అరేనాలో IIFA ఉత్సవం 2024 జరగనుంది. మొదటి రోజు గ్రాండ్ ఓపెనింగ్ ను ప్లాన్ చేయగా, తమిళం, మలయాళం భాషలలో అవార్డులు, ప్రదర్శనలు ఉండబోతున్నాయి. మరుసటి రోజు ప్రత్యేకంగా తెలుగు, కన్నడకు సంబంధించిన ఇండస్ట్రీల అవార్డులను అందజేయబోతున్నారు. అయితే ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేకంగా పెద్ద ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం. కాగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులచే అద్భుతమైన ప్రదర్శనలు, అవార్డుల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలను కలిగి ఉన్న ఈ కార్యక్రమం విలాసవంతంగా, ఉత్సాహభరితంగా ఉండబోతోంది.
అయితే ఈ ఐఫా అవార్డులలో అన్నింటికంటే ముఖ్యమైనది హోస్టింగ్. హోస్ట్ లు స్టేజ్ పై చేసే చరమత్కారం, సెటైర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వాళ్ళ కామెడీ టైమింగ్ ఎంత బాగుంటే షో అంత పెద్ద సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇతర భాషల సంగతి పక్కన పెట్టి తెలుగులో హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు ? అంటే.. ఇంకెవరూ ఈ ఏడాది హనుమాన్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పాన్ ఇండియా హీరో తేజ సజ్జా అని సమాచారం. అలాగే ఈ ఏడాది జరిగే ఈవెంట్‌కి తెలుగు సినిమా నుండి కొంతమంది పెద్ద స్టార్స్‌ని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తేజతో పాటు ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుంది. అయితే తేజ సజ్జా చాలా ఆకర్షణీయమైన వ్యక్తి. మరి అతను ఈ షోని ఎలా హోస్ట్ చేస్తాడో చూడాలి. కాగా 2023లో కొన్ని పెద్ద సినిమాలు వచ్చాయి. కాబట్టి అవార్డుల కోసం ఈసారి పోటీ చాలా ఎక్కువగా ఉంది.
సెప్టెంబర్ 7న పర్ఫార్మెన్స్
సెప్టెంబర్ 8న పర్ఫార్మెన్స్
హోస్ట్‌లు : తేజ సజ్జా (తెలుగు), అకుల్ బాలాజీ (కన్నడ), విజయ్ రాఘవేంద్ర – హోస్ట్ (కన్నడ)
DSP (4 భాషల పర్ఫార్మన్స్)
రకుల్ ప్రీత్ సింగ్ (తెలుగు, తమిళం)
శ్రీలీల (తెలుగు, కన్నడ). ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఇదే. అయితే ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయేమో తెలియాలంటే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ. ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాం రేపు హైటెక్స్ లో ఘనంగా జరగబోతోంది.