Ajay Bhupathi: మైత్రి మూవీ మేకర్స్ లో మంగళవారం దర్శకుడు

Ajay Bhupathi: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఇప్పుడైతే రామ్ గోపాల్ వర్మ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు కానీ ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాలు అంటేనే వేరే రేంజ్ లో ఉండేవి. రామ్ గోపాల్ వర్మ ఆలోచనలే చాలా డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పొచ్చు. అయితే అతి తక్కువ ఏజ్ లోనే ఎన్నో పుస్తకాలు చదవడం. సత్యేంద్ర వంటి ఫ్రెండ్ రాంగోపాల్ వర్మ జీవితంలో ఉండటం వలన ప్రపంచ స్థాయి సినిమా గురించి అలానే చాలా ఫిలాసఫీ పుస్తకాల గురించి రాంగోపాల్ వర్మ కి తెలిసింది.ఇక రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు ఒకప్పుడు సంచలనం.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న చాలా మంది దర్శకులు ఒకప్పుడు రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసిన వాళ్లే. రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన చాలా మంది దర్శకులు, నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇకపోతే రాంగోపాల్ వర్మ దగ్గర వీరప్పన్ అనే సినిమాకి పనిచేశాడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ అందుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా సెటిలైపోయాడు.

Ajay Bhupathi

- Advertisement -

అజయ్ భూపతి చేసిన రెండవ సినిమా మహాసముద్రం. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇకపోతే రీసెంట్ గా మంగళవారం అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సినిమాను అందుకున్నాడు అజయ్ భూపతి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కాకుండా మైత్రి మూవీ మేకర్స్ లో ఒక యాక్షన్ ఫిలిం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంకా నటీనటులు ఫిక్స్ కాలేదు. ఈ సినిమా తెలుగులో కానీ లేదంటే డైరెక్ట్ గా హిందీలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మంగళవారం సీక్వెళ్ రెడీ చేయనున్నాడు అజయ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు