Raj Tarun – Lavanya: కేసులో ఊహించిన ట్విస్ట్.. హీరోయిన్ మాల్వికి మరో ఎఫైర్..!

Raj Tarun – Lavanya..టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ వ్యవహారం ఎప్పుడైతే స్టేషన్ వరకు వెళ్లిందో అప్పటినుంచి వీరి కేసులో రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. ముఖ్యంగా పోలీసులకు సైతం ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఇప్పటికే ముగ్గురి పైన కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మొదట రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ పైన కేసు పెట్టిన లావణ్య.. ఆ తరువాత రాజ్ తరుణ్ కూడా తిరిగి మళ్లీ ఆమె పైన కేసు వేయడం జరిగింది. హీరోయిన్ మాధవి కూడా తన కుటుంబం పరువు తీసేలా చేస్తోందని.. తన తమ్ముడిని బెదిరిస్తోంది అంటూ లావణ్య పైన కూడా కేసు పెట్టడం జరిగింది.

Raj Tarun - Lavanya: Expected twist in the case.. Heroine Malvi has another affair..!
Raj Tarun – Lavanya: Expected twist in the case.. Heroine Malvi has another affair..!

హీరోయిన్ మాల్వి పై ఆరోపణలు..

గత రెండు రోజుల క్రితం లావణ్య ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక సూసైడ్ లెటర్ రాసినట్లుగా కూడా కథలు వినిపించాయి.. ఇప్పుడు తాజాగా ఈ కేసులోనే మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ ,లావణ్య, మాల్వి ఎపిసోడ్ పైన ముంబైకి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి ఒక వీడియోని సైతం రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ మాల్వీ పైన ఆమె పలు రకాల ఆరోపణలు చేసినట్లు సమాచారం.

యోగేష్ తో మాల్వి ఎఫైర్..

ముఖ్యంగా ప్రేమ పేరుతో తమ కుటుంబాలన్నీ కూడా ఆమె లాక్కుంది అంటూ యోగేష్ తల్లి తెలియజేసింది. తన కుమారుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నారని జైలుకు పంపించేలా కూడా చేసింది అంటూ తెలియజేసింది.. అంతేకాకుండా హీరోయిన్ మాల్వి తన కుమారుడు యోగేష్ ను ట్రాప్ చేసి మరి ప్రేమలో పడేలా చేసింది.. ఆ తర్వాత తమకు ఉన్న ఆస్తులు అన్నీ కూడా లాక్కుంది అంటూ పలు విషయాల వెల్లడించింది.. నాలుగేళ్లుగా తమ కుటుంబాన్ని హీరోయిన్ మాల్వి ఇబ్బంది పెడుతూనే ఉందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటూ తెలియజేసింది.

- Advertisement -

మాల్వి పై యోగేష్ కత్తితో దాడి.. క్లారిటీ ఇచ్చిన యోగేష్ తల్లి..

అయితే 2020లో ముంబైలో ఉన్నప్పుడు హీరోయిన్ మాల్వి పైన యోగేష్ కత్తితో దాడి చేశారనే విధంగా వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా యోగేష్ తో మాల్వి పెళ్లికి ఒప్పుకోలేదని.. అందుకే అప్పట్లో దాడి చేశారనే విధంగా వార్తలైతే వినిపించాయి.. కానీ అప్పుడు జరిగిన అన్ని విషయాలను సైతం యోగేష్ తల్లి ఇప్పుడు మీడియా ముందు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. మరి ఇలాంటి తీవ్రమైన ఆరోపణలపైన అటు మాల్వి, రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారని విషయం పైన అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్ లు సైతం మాల్వి చూడడానికి అమాయకురాలుగా కనిపిస్తున్నప్పటికీ ఇన్ని పనులు చేసిందా అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఎంతమంది ఎలాంటి ఆరోపణలు చేస్తారో అంటూ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై మాల్వి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు