Raj Tarun – Lavanya : లావణ్యకు అనుకూలంగా మారుతున్న కేసు… రాజ్ తరుణ్ కి అందిన నోటీసులు

Raj Tarun – Lavanya : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ – లావణ్య ల ప్రేమ వ్యవహారం కేసు రోజురోజుకూ ముదిరిపోతోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య కేసు నమోదు చేయడం దగ్గరి నుండి, రాజ్ తరుణ్ రిప్లై, మధ్యలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాటల యుద్ధం తో పాటు లావణ్య ఏకంగా లాయర్ తో అఫిషియల్ గా కేసు పెట్టడం, మీడియా తో డిబేట్లు పెట్టడంతో సంచలనం గా మారింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ నెట్టింట సంచలనం గా మారింది. దీని వల్ల రాజ్ తరుణ్ రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇక రీసెంట్ గా ఈ కేసులో ఆరోపించబడుతున్న మాల్వి మల్హోత్రా గురించి ముంబైకి చెందిన లోకేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ తల్లి ఈ వివాదంపై స్పందించి వీడియో రిలీజ్ చేసింది. హీరోయిన్ మాల్వి తన కొడుకుని మోసం చేసి ఆస్తులు కొట్టేసిందని వీడియో రిలీజ్ చేయడం సంచలనం గా మారింది.

Narsing police sent notices to hero Raj Tarun to attend the investigation

రాజ్ తరుణ్ పోలిసుల నోటీసులు…

ఇదిలా ఉండగా తాజాగా రాజ్ తరుణ్ కేసు ముదిరిపోతోంది. కీలక అంశాలన్నీ రాజ్ తరుణ్ ని అపరాధిగా చూపిస్తుండగా, ఈ కేసు రాజ్ తరుణ్ మెడకు ఉచ్చులా బిగుసుకుపోతుందని చెప్పాలి. తాజాగా లావణ్య కేసుపై నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు పంపడం జరిగింది. ఈ నెల 18 లోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. కాగా ఈ కేసుపై BNSS45 కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. ఇక రాజ్ తరుణ్ పై సెక్షన్ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది.

- Advertisement -

కేసు లావణ్యకు అనుకూలంగా మారుతుందా?

ఇక రాజ్ తరుణ్ – లావణ్య కేసులో ముందు లావణ్య పై పలువురికి సందేహాలున్నా, జరుగుతున్న పరిణామాలు, అలాగే లభ్యమవుతున్న ఆధారాలు చూస్తుంటే ఈ కేసు లో రాజ్ తరుణ్ ని నిందితుడిగానే సాక్ష్యాలు చూపిస్తున్నాయి. మెల్లిగా ఈ కేసు లావణ్యకి అనుకూలంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లాయర్ దిలీప్ సుంకర కూడా కేసు విషయంలో గట్టిగా వాదిస్తున్నాడు. ఇక ఇప్పటికే 100 కి పైగా ఆధారాలు పోలీసులకు చూపించమని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి లావణ్య రాజ్ తరుణే కావాలని అంటున్న విషయం తెలిసిందే. మరి ఈ కేసు తుదిదశకు చేరుకునేది ఎప్పుడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు