Abhishek Bachchan: విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్న అశ్వద్ధామ కొడుకు..!

Abhishek Bachchan: అశ్వద్ధామ.. ఇటీవల విడుదలైన కల్కి 2898ఏడి చిత్రం లో అశ్వద్ధామ గా నటించి అందరినీ ఆకట్టుకొని..నిజంగా అశ్వద్ధామ బ్రతికి ఉంటే ఇలాగే ఉంటారా అనే అనుమానాలు అందరిలో కలిగించిన ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిజానికి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు చేత శాపించబడ్డ అశ్వద్ధామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని చెబుతారు.. కానీ ఆయన ఎక్కడ ఉన్నారు అనే విషయాలు మాత్రం అంతు చిక్కలేదు. ఇక ఈ సినిమాలో నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ ను చూపించిన తీరు నిజంగా అశ్వద్ధామ వచ్చి ఈ సినిమాలో నటించారేమో అన్నట్టు అనిపించింది.. అంత అద్భుతంగా నటించారు అమితాబ్ బచ్చన్ .. ఈ సినిమా విజయం ఎంతో ఆనందంలో కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన కొడుకు విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Abhishek Bachchan: Aswaddhama's son will enter as a villain..!
Abhishek Bachchan: Aswaddhama’s son will enter as a villain..!

రూట్ మార్చుకున్న అభిషేక్ బచ్చన్..

అసలు విషయంలోకి వెళితే.. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ హీరో అయినప్పటికీ ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకునే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఆయన సాధించలేదు. ధూమ్ లాంటివి ఉన్నప్పటికీ ఇతని కంటే జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ కి వచ్చిన పేరే ఎక్కువ.. తండ్రి లెగసీని ఆ స్థాయిలో కొనసాగించలేకపోయాడనే అసంతృప్తి అభిమానులలో ఇప్పటికీ ఉంది. కానీ సరైన పాత్ర దొరికితే చెలరేగిపోతాడని మణిరత్నం రావణ్ లాంటి వాటిలో బయటపడింది. ఆమధ్య దస్వీ అనే వెబ్ మూవీ కూడా బాగానే విజయాన్ని సాధించుకుంది. అయితే చెప్పుకోదగ్గ గుర్తింపు అయితే రాలేదు. ఈ క్రమంలోనే ఆయన తన రూటు మార్చుకోబోతున్నారని సమాచారం.

విలన్ గా ఎంట్రీ ఇస్తూ..

జూనియర్ అశ్వద్ధామ గా ఇప్పుడు పేరు దక్కించుకున్న అభిషేక్ బచ్చన్ త్వరలో విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్న చిత్రం కింగ్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.. ఇందులో తండ్రీ కూతుర్లు ఇద్దరూ కూడా నటిస్తున్నారు అయితే కింగ్ ఖాన్ స్పెషల్ గా డిజైన్ చేసిన కామెడీ పాత్ర కాబట్టి మొదటి నుంచి చివరిదాకా ఉండకపోయినా.. కేవలం కొన్ని సన్నివేశాలలో మాత్రమే నటిస్తారట. ఇందులో విలన్ గా అభిషేక్ బచ్చన్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. సుహానా కొన్ని నెలల క్రితమే నెట్ ఫ్లిక్స్ మూవీ ఆర్చీస్ తో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.. కంటెంట్ వరస్ట్ గా ఉంది అంటే ఆమె నటన కూడా అంతకుమించి వరస్ట్ గా ఉందని విమర్శలు వస్తున్నాయి . అందుకే ఈసారి స్వయంగా రంగంలోకి దిగి కింగ్ మూవీని సెట్ చేశారు షారుఖ్ ఖాన్..

- Advertisement -

షారుక్ ఖాన్ , అభిషేక్ బచ్చన్ కాంబో చిత్రాలు..

ఇకపోతే సుహానా కి షారుఖ్ ఖాన్ నిజజీవితంలాగే ఇందులో కూడా నాన్నగా కనిపిస్తాడా? లేదా మరేదైనా ట్విస్ట్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. సుజయ్ ఘోష్ కింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పటాన్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద పర్యవేక్షణ తో పాటు షారుక్ ఖాన్ తో కలిసి నిర్మాణ భాగస్వామ్యంలో పాలుపంచుకోబోతున్నారు. ఇదిలా ఉండగా గతంలో షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ , కబీ అల్విదా నా కెహనా, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాలలో కలసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోగా కాకుండా విలన్ గా మొదటిసారి నటించబోతున్నారు మరి ఈ సినిమా అభిషేక్ బచ్చన్ కు ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు