Vicky Kaushal – Katrina Kaif: ప్రెగ్నెన్సీ పై స్పందించిన విక్కీ.. ఏమన్నారంటే..?

Vicky Kaushal – Katrina Kaif: బాలీవుడ్ జంట విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వీరిద్దరూ దాదాపు కొన్నేళ్లపాటు ప్రేమించుకుని మరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.. ఇదిలా ఉండగా గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే .. అయితే అప్పట్లో ఆమె గర్భవతి కాదు అని తేలిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాగా తొలిసారి కత్రినా ప్రెగ్నెన్సీ పై వస్తున్న పుకార్లకు ఈమె భర్త ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Vicky Kaushal - Katrina Kaif: Vicky reacts on pregnancy.. What is it..?
Vicky Kaushal – Katrina Kaif: Vicky reacts on pregnancy.. What is it..?

రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన విక్కీ..

విక్కీ కౌశల్ ప్రస్తుతం ‘బ్యాడ్ న్యూస్ ‘అనే చిత్రంలో నటిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది . ఇందులో త్రిప్తి డిమ్రి రెచ్చిపోయి మరీ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేయగా ఈ పాటలో వీరిద్దరి రొమాన్స్ చూసి కచ్చితంగా కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మధ్య గొడవలు మొదలైతాయని అందరూ అనుకున్నారు.. అంతలా వారిద్దరూ రెచ్చిపోయారు.. ఇకపోతే ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు విక్కీ కౌశల్.. ఇదిలా ఉండగా ఒక పాట విషయంలో ఆయనను చాలామంది ట్రోల్ చేశారు.. ఆ ట్రోల్స్ తో పాటు తన భార్య కత్రినా గర్భవతి అనే వార్త కూడా వైరల్ అవుతూ ఉండడంతో ఎట్టకేలకు ఆయన మౌనం వీడి క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.

కత్రినా ప్రెగ్నెంట్ కాదు – విక్కీ కౌశల్..

ఇంటర్వ్యూలో భాగంగా విక్కీ తన భార్య కత్రినా కైఫ్ గురించి ప్రస్తావించారు.. నా జీవితంలోకి కత్రినా కైఫ్ రావడంతో నా జీవితం మరింత ఆనందంగా మారింది అని తెలిపాడు. అలాగే కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న ప్రచారంపై మాట్లాడుతూ.. గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే సంతోషంగా మీతో పంచుకుంటాము.. అయితే నెట్టింట వైరల్ గా మారుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు ప్రస్తుతం బాడ్ న్యూస్ మూవీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

బ్యాడ్ న్యూస్ పై అలాంటి కామెంట్స్..

ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన తౌబా తౌబా పాట గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ పాట కోసం టీమ్ మొత్తం కష్టపడి పనిచేసాము.. సుమారు నాలుగు రోజులపాటు డాన్స్ నేర్చుకున్నాను.. స్టెప్పులు నేర్పించి ఎంతగానో శ్రమించిన టీం కి ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రేక్షకులు నా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించారు.. ఈ పాట భారీ విజయాన్ని అందుకుంది.. ముఖ్యంగా అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ తెలిపారు విక్కీ కౌశల్.. ఇకపోతే ఈ సినిమా జూలై 19వ తేదీన విడుదల కానుంది. ఇక కత్రినా విషయానికి వస్తే.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తెలుగులో మల్లీశ్వరి సినిమా చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక తర్వాత తెలుగు సినిమాలలో నటించకుండా బాలీవుడ్ కే పరిమితమైన ఈమె ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు