Allu Arjun : ‘కల్కి’ మోజులో పడ్డ అల్లు అర్జున్..

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా ‘పుష్ప’ మాదిరే పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ రిలీజ్ కానుంది. నిజానికి ఆగస్టు 15 నే రిలీజ్ అవుతుంది అని ప్రకటించిన ఈ సినిమా.. షూటింగ్ పార్ట్ డిలే అవ్వడం వల్ల డిసెంబర్ కి వాయిదా పడింది. ‘ఫహాద్ ఫాజిల్ పోర్షన్ చాలా వరకు పెండింగ్ ఉండటంతో.. షూటింగ్ ఆలస్యం అవుతుంది’ అనేది కొందరి వాదన.

సరే అది పక్కన పెడితే.. ‘పుష్ప 2’ కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు? ఈ ప్రశ్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులని వెంటాడుతుంది. నామ మాత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని గతేడాది ప్రకటించారు. మధ్యలో అట్లీతో పాన్ ఇండియా సినిమా అన్నారు. అది వెనక్కి వెళ్ళిపోయింది. మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది.

‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ మరో సినిమాకి కమిట్ అవ్వలేదు. కాబట్టి.. అల్లు అర్జున్ సినిమానే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందే ఛాన్సులు కూడా లేకపోలేదు. అయితే స్క్రిప్ట్ విషయంలో అల్లు అర్జున్ కి ఓ కోరిక ఉందట.

- Advertisement -

అదేంటంటే.. ఇప్పుడు ‘కల్కి..’ హవా నడుస్తుంది. అలాగే పాన్ ఇండియా ప్రాజెక్టుకి మైథాలజీ టచ్ ఉంటే, కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘కార్తికేయ 2’ ‘హనుమాన్’ ‘కల్కి 2898 ad’ అన్నిటిలోనూ ఇది కామన్ గా ఉన్న అంశం. అసలు పురాణాల ప్రస్తావన లేకుంటే ఇవి.. సాదా సీదా సినిమాలే..! కానీ పురాణాల అంశాన్ని జోడించడం వల్ల వీటి స్థాయి మారిపోయింది. సో అల్లు అర్జున్ కి కూడా ఇలా పురాణాల టచ్ ఉన్న ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని ఉందట. త్రివిక్రమ్ కి కూడా పురాణాలపై మంచి పట్టు ఉంది. అల్లు అర్జున్ తో ఫ్రెండ్షిప్ కూడా అదే స్థాయిలో ఉంది. అందువల్ల అల్లు అర్జున్.. త్రివిక్రమ్ వద్ద ఓపెన్ అయిపోయాడు.

బన్నీ కోరిక బాగానే ఉంది. కానీ త్రివిక్రమ్ కి.. ఇది కత్తి మీద సాములాంటిది. ఎందుకంటే త్రివిక్రమ్ కి ఎంత పురాణాలపై పట్టు ఉన్నప్పటికీ.. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ని టచ్ చేసిన అనుభవం అతనికి లేదు. కాబట్టి.. ఓ రేంజ్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తే తప్ప.. అది త్రివిక్రమ్ కి అంత ఈజీ వ్యవహారం కాదు అనే చెప్పాలి.

– Kumar Naidu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు