Rakul Preet Singh.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గత కొద్ది రోజుల నుంచి వార్తలో నిలుస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా తన తప్పిదం ఏమీ లేకపోయినా ఈమె భర్త, సోదరుడి కారణంగా వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఫిట్నెస్ ఫ్రీక్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈమె భర్త.. ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఒక సినిమాను తన బ్యానర్లో తీసి నష్టపోయిన జాకీ.. అందులో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేదని.. రెండు నెలల జీతాన్ని ఏడాదికి పైగా ఇవ్వకపోవడంతో ఉద్యోగస్తులందరూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. పైగా రూ .250 కోట్లు నష్టాన్ని జాకీ భగ్నానీ చవి చూడాల్సి వచ్చింది. ఈ కారణంగా రకుల్ వార్తల్లో నిలిచింది.
డ్రగ్ కేసులో అరెస్టు అయిన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు..
అయితే ఇప్పుడు ఈ విషయాలు మరువకముందే మరోసారి వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా డ్రగ్స్ కేసులో ఈమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అడ్డంగా దొరికిపోయాడు.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు.. ఈ కేసులో రకుల్ ప్రీత్ కి సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెర పైకి వస్తున్నాయి.. రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ .. డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో అధికారులు అతనిపై నిఘా పెట్టారు.
అమన్ స్థావరాలపై దాడులు..
తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ SOT పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం.. అమన్ ప్రీత్ సింగ్ నివాసాలు, అతడు తిరిగే ప్రదేశాల మీద ఒకేసారి దాడులు చేయడం జరిగింది. నైజీరియా నుండి వచ్చిన ఐదు మంది డ్రగ్ పెడ్లర్స్ తో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.. ముఖ్యంగా డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన 13 మందిలో ఈయన ఒకడు కాగా వీరందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. అలా అరెస్ట్ అయిన వారిలో కొందరు గతంలో పలుమార్లు డ్రగ్ కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. అమన్ , నైజీరియన్స్ నుండి రెండు కోట్ల విలువైన కుక్కైను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. అంతే కాదు 199 గ్రామ్స్ కొకైన్, 10 సెల్ ఫోన్స్, రెండు బైక్స్ రికవరీ చేసుకున్నట్లు సమాచారం.
రకుల్ మెడకు మరో కొత్త సమస్య..
ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎందుకంటే
పైగా గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్ లో ఇరుక్కున్న విషయం తెలిసిందే కానీ అప్పుడు ఆమెకి ఈడి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈమె మెడకు మరో కొత్త సమస్య చుట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తమ్ముడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.. మరి దీనిపై నిజా నిజాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.