HBD Katrina Kaif.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తెలుగు వారి మల్లీశ్వరి అనడంలో సందేహం లేదు.. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకొని.. తన అందచందాలతో యువతను ఆకట్టుకున్న కత్రినా కైఫ్ పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా నేడు ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. మరి ఈ సందర్భంగా ఈమె సక్సెస్ స్టోరీ ఏంటి..? మోడల్ నుంచి స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
చిన్నప్పుడే ఎన్నో దేశాలు చుట్టేసిన కత్రినా..
1983 జూలై 16న బ్రిటీష్ హాంగ్ కాంగ్లో జన్మించిన కత్రినా కైఫ్ భారత్ కి రాకముందు ఎన్నో దేశాలు తిరిగింది.. హాంగ్ కాంగ్ లో జన్మించిన ఈమె చైనా, జపాన్, ప్రాన్స్ దేశాలలో పెరిగింది.. అక్కడి నుంచి స్విజర్లాండ్ వెళ్లి కొన్ని నెలలు తర్వాత పోలాండ్.. అక్కడ నుంచి బెల్జియం వంటి దేశాలు తిరిగిన కత్రినా కైఫ్ కుటుంబం.. ఆ తర్వాత లండన్ కు వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఈమె లండన్ లో పెరిగానని అందరూ అనుకుంటారు.. కానీ భారత్ కి రావడానికి మూడేళ్ల ముందు మాత్రమే ఈమె లండన్ లో ఉంది. ఇక కెరియర్ విషయానికి వస్తే.. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ చేసిన ఈమె ఆ తర్వాత దానినే కెరియర్‌గా మలుచుకొని మోడల్ గా కింగ్ ఫిషర్ క్యాలెండర్లో కనిపించింది కూడా..
మోడల్ గా కెరియర్ మొదలు..
లండన్ లో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో నిర్మాత కైజద్ గుస్తాద్ తన సినిమా బూమ్ లో అవకాశం కల్పించారు.. అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవడంతో విమర్శలు ఎదురయ్యాయి.. ఈ సినిమాలో నటించేటప్పుడు ఈమెకు మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి కానీ హిందీ సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో 2004లో మల్లీశ్వరి సినిమాలో నటించగా.. ఈ సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ ఈమెకు అవకాశాలు వచ్చేలా చేసిందని చెప్పవచ్చు.
విమర్శలతో మొదలైన సినీ ప్రయాణం..
2005లో మైనే ప్యార్ క్యూ కియా ?, నమస్తే లండన్ వంటి చిత్రాలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.. అయితే ఈమె నటిస్తున్న సినిమాలు విజయం అవుతున్నాయి.. కానీ ఈమె నటనకు మాత్రం విమర్శలు వినిపించేవి. ఆ తర్వాత 2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. అంతే కాదు ఉత్తమ నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది..
స్టార్ హోదా అందుకుని ఎంతోమందికి ఆదర్శం..
ఆ తర్వాత ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తూ వరుస ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకొని తన నటనతో ప్రశంసలు అందుకొని రికార్డులు సృష్టించింది.. ఇకపోతే నటనలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు భారీ సక్సెస్ అందుకున్న కత్రినా కైఫ్ కెరియర్ ఎంతోమందికి ఆదర్శం అని చెప్పవచ్చు.