Siri Hanumanth: బుల్లితెరకి గుడ్ బై.. ఏం చేయబోతోందో తెలిస్తే షాక్..!

Siri Hanumanth.. యూట్యూబ్ నుంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి హనుమంతు.. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. జబర్దస్త్ సిరిగా మారిపోయింది.. యాంకర్ గా అలరించిన ఈమె.. ఉన్నట్టుండి షో వదిలేసింది . దీంతో ఇప్పుడు ఏం చేస్తోంది అనే సస్పెన్స్ నెలకొన్నది… ఈ క్రమంలోనే తాజాగా ప్రస్తుతం తాను ఏం చేస్తోంది? అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Siri Hanumanth: Goodbye to television.. Shock to know what she are going to do..!
Siri Hanumanth: Goodbye to television.. Shock to know what she are going to do..!

బిగ్ బాస్ తో క్రేజ్..

బిగ్ బాస్ షో లో షణ్ముఖ్ తో ఈమె చేయించిన రొమాన్స్, పండించిన కెమిస్ట్రీ కారణంగా.. షణ్ముఖ్ తన ప్రేయసి దీప్తితో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ముఖ్యంగా వీరిద్దరూ హౌస్ లో ఉన్నప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లను అందుకోవడంలో బాగా ఆరితేరిపోయింది సిరి. ఈ నేపథ్యంలోనే వరుస క్రేజీ ఆఫర్లను అందుకుంటూ సినీ ఇండస్ట్రీలో బిజీ సెలబ్రిటీగా మారిపోయింది. సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది, ఇదిలా ఉండగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆమె ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.

వరుస సినిమాలతో బిజీ..

జవాన్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టేసిన సిరి.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టు స్పష్టం చేసింది.. అంతేకాదు జవాన్ రేంజ్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలిపింది.. మరి ఆ బిగ్ ప్రాజెక్టు వివరాలు ఏంటి అనేది చెప్పలేదు.. కానీ కొత్త ప్రాజెక్టుతో రానున్నాను అని మాత్రం స్పష్టం చేసింది. ఇక దీంతోపాటు హీరో శర్వానంద్ సినిమా చేస్తోందని.. అలాగే మరో కొత్త ప్రాజెక్టు త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఇక బుల్లితెరకి గుడ్ బై చెప్పనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కన్ఫ్యూజన్లో సిరి..

అలాగే శ్రీహాన్, శేఖర్ మాస్టర్ లతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది ..అయితే ఈసారి శ్రీహాన్ తో రొమాన్స్ చేయడం లేదని.. ఆయనకు మరో అమ్మాయితో రొమాన్స్ ఉంటుందని.. కొత్తగా ఉంటుందని అందుకే ట్రై చేస్తున్నామని తెలిపింది సిరి.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె టీవీ షోస్ గురించి చెబుతూ టీవీ షోలు ఇంకా ఏం చేయడం లేదు… టీవీ ? సినిమా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటూ కూడా తెలిపింది.

శ్రీహాన్ తో సహజీవనం..

ఇక సిరి , శ్రీహాన్ ప్రేమ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. అంతేకాదు ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.. గతంలో సిరి ఒక వ్యక్తిని ప్రేమించడగా.. ఆయన ప్రమాదంలో చనిపోయారు.. పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది సిరి.ఆ తర్వాతే శ్రీహాన్ దగ్గర అయ్యారు. అప్పటి నుంచి కోలుకున్న ఈమె ఇప్పుడు శ్రీహాన్తో సహజీవనం చేస్తూ కెరియర్ పరంగా దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది.. ఇక కెరియర్ లో బాగా సక్సెస్ అయిన తర్వాతనే వివాహం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు