SIIMA Awards 2024 : సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డ్స్ ఉంటాయి.. అందులో సైమా అవార్డ్స్ కూడా ఉన్నాయి.. ప్రతి ఏటా ఈ సినిమా ఇండస్ట్రీకి సైమా అవార్డులు వస్తుంటాయి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన సినిమాలు, యాక్టర్స్, టెక్నిషియన్స్ టాలెంట్‌ను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో ఉన్నాయి.. సైమా అవార్డ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ లో రానున్నాయి.. ఈ అవార్డ్ వేడుకను ప్రతి ఏడాది దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.. అలాగే ఈ ఏడాది కూడా అక్కడే నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు..
ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో దుబాయ్ వేదికగా ఈ 12వ ఎడిషన్ వేడుకలు జరగనున్నాయి. అయితే తాజాగా ఈ పురస్కారాల కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను సైమా విడుదల చేసింది.. ఈ అవార్డు ల నామినేషన్స్ లో ఈ ఏడాది సౌత్ నుంచి రెండు సినిమాలకు ఎక్కువ అవార్డులు వరించినట్లు తెలుస్తుంది.. అందులో 11 విభాగాల్లో తెలుగు నుంచి నాని దసరా, తమిళం నుంచి రజనీకాంత్ జైలర్ నామినేట్ అయ్యాయి.. రజనీకాంత్ తో సమానంగా నానికి అవార్డులు రాబోతుండటం విశేషం.. ఈ వార్త విన్న నాని ఫ్యాన్స్ సంబరాల్లో మునిపోయారు..
నాని దసరా సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఈ సినిమా నానికి కేరీర్ పాయింట్ అయ్యింది.. మాస్ లుక్ లో నాని కనిపించారు.. కథ పరంగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ఈ సినిమాకు ఇన్ని అవార్డులు రావడం మామూలు విషయం కాదు.. రజినీకాంత్ తో సమానంగా వచ్చాయి.. ఇక ఈ ఏడాది సైమా అవార్డులు మిగిలిన భాషల్లో ఏ సినిమాకు వచ్చాయో చూస్తే.. మలయాళం నుంచి టొవినో థామస్ 2018, కన్నడ నుంచి దర్శన్ కాటేర 8 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే నాలుగు చిత్రాలు కూడా అటు కథ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బ్లస్టర్ హిట్‌గా నిలిచాయి. ఆడియెన్స్ ఈ చిత్రాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.. ప్రస్తుతం ఈ సినిమా హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు…