Nivetha Thomas: నివేదా థామస్ ను టార్చర్‌ పెడుతున్న దర్శకుడు?

 

Nivetha Thomas: ప్రముఖ నటి నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ అంతకుముందు కొన్నేళ్ల నుంచి సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. నాని హీరోగా నటించిన నిన్ను కోరి సినిమాలో హీరోయిన్గా నటించి విపరీతమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన జై లవకుశ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో అదరగొట్టింది. ఈ బ్యూటీ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది ఈ కేరళ కుట్టి. Nivetha Thomas

ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో స్పెషల్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. నాని హీరోగా చేసిన జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు…. ఆ తర్వాత రెండో సినిమా కూడా నానితోనే చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118 సినిమాలలో నటించి…. ఆ తర్వాత బ్రోచేవారెవరురా అనే సినిమాతో మరోసారి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

ఇక ఈ అమ్మడు హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పిస్తోంది. దర్బార్ సినిమాలో రజనీకాంత్ కూతురుగా నటించి అలరించింది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో మెయిన్ లీడ్ పోషించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు సన్నగా ఎంతో అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ…. ఇప్పుడు కాస్త బొద్దుగా తయారయ్యింది.

Nivetha Thomas: "He is my husband"..Nani beauty comments viral..!
Nivetha Thomas

దీంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ తమిళ దర్శకుడు నివేదాతో చెప్పారట. కానీ తన కోరిక తీర్చితేనే…. సినిమా ఛాన్సులు వస్తాయని…. తాను చెప్పినట్టు చేస్తేనే ఛాన్సులు ఇస్తానని చెప్పాడట. కానీ నివేద అలాంటి వాటికి లొంగనంటూ ఖరాఖండీగా చెప్పేసిందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు