Suchitra Krishnamurthy : విదేశాల్లో జరిగే కొన్ని సంఘటనలు భారతీయులకు వింతగా ఉంటాయి. అయినప్పటికీ, చాలా మంది వ్యక్తులు వింతగా అనిపించే వాటిని ప్రయత్నించడానికి వెనకడుగు వేయరు. ఓసారి ట్రై చేస్తే పోలా అనే ఆలోచనతో ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఆ వింతలను చూశాక దాదాపు దిమ్మ తిరిగినంత పనవుతుంది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. భారతీయ నటి సుచిత్రా కృష్ణమూర్తి విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పార్టీ అని చెప్పగానే వెళ్ళిన ఈ నటికి అక్కడ చూడకూడని సీన్ కన్పించిందట.
పార్టీలో అసలు ఏం జరిగింది?
నటి సుచిత్రా కృష్ణమూర్తి ప్రస్తుతం యూరప్‌లో వెకేషన్లో ఉన్నారు. కాగా జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ‘నేక్డ్ పార్టీకి’ ఆమె హాజరయ్యారు. అయితే ఈ సమయంలో ఆమెకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అలాగే మీడియాతో మాట్లాడిన సుచిత్రా కృష్ణమూర్తి ఇది నాకు చేదు అనుభవం అని అన్నారు. నేను ఆ పార్టీని ఆస్వాదించలేదు అంటూ అసలు అక్కడ ఏం జరిగిందో వివరించింది. అక్కడ నేక్డ్ పార్టీ లాంటి విషయాలన్నీ సర్వసాధారణమని సుచిత్ర చెప్పింది. శరీర సానుకూలతను ప్రోత్సహించడాన్ని వారు విలువైనదిగా భావిస్తారు. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్.. ట్రై చేద్దాం అనుకున్నాను. స్నేహితుడికి చెందిన బార్లో పార్టీ జరుగుతోంది. నేను అతిథి జాబితాలో ఉన్నాను. అందుకే అందరితో కలిసి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్లిన వెంటనే కన్పించిన షాకింగ్ సీన్ చూసి వెంటనే పారిపోయాను. నేను చాలా పద్ధతి గల వ్యక్తిని. ఎవరి ప్రైవేట్ పార్ట్ చూడాలనే ఆసక్తి నాకు లేదని సుచిత్ర చెప్పడం గమనార్హం.
అలాంటి పార్టీలు తప్పుకాదు
ఇలాంటి పార్టీ మంచి ఆలోచనలతో వస్తుందని సుచిత్ర అన్నారు. ఆనందం, సానుకూలత కోసం జరుగుతుందని, ఈ పార్టీ అస్సలు అసభ్యంగా లేదని అన్నారామె. అయినప్పటికీ ఇది విదేశీ కల్చర్. భారతీయులమైనందున మన శరీరాల గురించి స్పృహతోనే పెరిగాము మనం. కాబట్టి అలాంటి వాటిలో పాల్గొనడం కష్టమే అని సుచిత్ర చెప్పుకొచ్చింది. సుచిత్రా కృష్ణమూర్తి 20 నిమిషాల పాటు పార్టీలో ఉన్నారట. కానీ రాత్రంతా పార్టీ కొనసాగింది.
గాయత్రి మంత్రం పఠించాల్సిందే
ఈ విషయం గురించి సుచిత్రా కృష్ణమూర్తి ఎక్స్ ప్లాట్ఫామ్లో కూడా పోస్ట్ చేసింది. అందులో నేను ఇటీవల బెర్లిన్‌లో బాడీ పాజిటివిటీ/నేకెడ్ పార్టీకి హాజరయ్యాను. నేను ఎప్పుడూ దేశీ అమ్మాయినే. స్నానం చేసి గాయత్రీ మంత్రం పఠించాల్సిన అవసరం ఉంది” అంటూ రాసుకొచ్చింది. కాగా ఈ విషయాన్ని సుచిత్ర తన కూతురి కావేరీకి కూడా చెప్పలేదనే విషయాన్ని వెల్లడించింది. కానీ ఆమెకు ఆ విషయం తెలిస్తే కచ్చితంగా సంతోషిస్తుంది అంటూ వివరించింది. కాగా ఆ పార్టీ నుంచి బయట పడిన ఫీలింగ్ గురించి సుచిత్ర మాట్లాడుతూ 20 నిమిషాల్లో తప్పించుకున్నా. కానీ, కనీసం అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేశాను అంటూ అక్కడ తనకు జరిగిన వింత అనుభవాన్ని వెల్లడించింది.