SIIMA 2024 : నాని పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు… ఆయనతో ఆయనకే పోటీ

SIIMA 2024 : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 12వ ఎడిషన్ కు సమయం ఆసన్నమైంది. బెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాలకు సైమా అవార్డులు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సైమా 23-2024 క్యాలెండర్ ఇయర్ లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన నామినేషన్లను తాజాగా ప్రకటించారు. ఈ వేడుక 2024 సెప్టెంబర్ 14, 15 తేదీల్లో దుబాయిలో జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2023లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి సైమా నామినేషన్లను అనౌన్స్ చేశారు. అయితే ఇందులో నానితో నానికే పోటీ అన్నట్టుగా ఆయన రెండు సినిమాలు పోటీ పడుతుండడం విశేషం.

నాని కష్టం పగవాడికి కూడా రావొద్దు

2023లో దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఒకే ఒక్క హీరో నాని. అంతేకాదు 2023 మిడ్ రేంజ్ హీరోలు ఎవ్వరికి కలిసి రాలేదు. ఒక్క టాలీవుడ్ టైర్ 2 హీరో సినిమా కూడా హిట్ అవ్వలేదు. కానీ నాని మాత్రం 2023లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న లక్కీ హీరోగా తన పేరును లిఖించుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన సైమా నామినేషన్స్ లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న మూవీ నామినేషన్లలో ఉండడం విశేషం. ఈ రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. మరి ఏ సినిమాకు నాని సైమా అవార్డును అందుకుంటారో చూడాలి.

- Advertisement -

కాగా నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 29 న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు.

సైమా 2024 నామినేషన్స్ లిస్ట్

సైమా 2024 నామినేషన్లలో టాలీవుడ్ నుంచి దసరా, తమిళంలో జైలర్, కన్నాడలో కాటేరా, మలయాళం నుంచి 2018 వంటి సినిమాలు నమినేషన్లలో ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఇందులో కీర్తి సురేష్, నాని హీరో హీరోయిన్లుగా నటించిన దసరా మూవీకి 11 నామినేషన్లతో ముందు వరుసలో ఉండగా, నాని మరో సినిమా హాయ్ నాన్న 10 కేటగిరీలలో నామినేట్ కావడం విశేషం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ కూడా 11 నామినేషన్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత 9 నామినేషన్లతో మామన్నన్, 8 నామినేషన్లతో కాటేరా, 7 నామినేషన్లతో సప్త సాగరాలు దాటి యెల్లో సైడ్ ఏ, 2018 మూవీ 8 నామినేషన్లతో, కథల్ ది కోర్ 7 నామినేషన్లలో పోటీలో ఉన్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆన్లైన్ ఓటింగ్ విధానం ద్వారా విజేతలను ఎంపిక చేయబోతున్నారు. అభిమానులు తమ అభిమాన తారాలకు సైమా అఫీషియల్ వెబ్సైట్ తో పాటు ఫేస్బుక్ పేజీలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. మరి ఇన్ని సినిమాలలో ఈ అవార్డు ఎవరిని వరిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు