Ramesh Narayanan : హీరో పరువు తీసిన మ్యూజిక్ డైరెక్టర్… స్టేజ్ పైనే దారుణంగా అవమానం

Ramesh Narayanan : ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు రమేష్ నారాయణన్ నటుడు ఆసిఫ్ అలీని వేదికపైనే అవమానించిన ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. మనోరతంగల్ అనే యాంతలజీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ స్టేజ్ పై వీరిద్దరి మధ్య ఏం జరిగింది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో చేతితో అవార్డు నిరాకరణ

చాలా కాలంగా ఎదురుచూస్తున్న మనోరతంగల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ జూలై 15న ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనోరతంగల్‌లోని నటీనటులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందించిన రమేష్ నారాయణ్ కూడా హాజరయ్యారు. ఆయనకు అవార్డును అందజేయడానికి నటుడు ఆసిఫ్ అలీని ఆహ్వానించారు. కానీ ఆయన అవార్డును తీసుకోవడానికి నిరాకరించడమే కాకుండా డైరెక్టర్ జయరాజ్ కు ఆ అవార్డును ఇచ్చి, డైరెక్టర్ చేతుల మీదుగా అందుకున్నాడు. అప్పటికే ఆసిఫ్ అలీ చేతితో అవార్డును అందుకున్న రమేష్ దాన్ని జయరాజ్ కి ఇచ్చి మళ్లీ అతని చేతి మీదుగా ఆ అవార్డును తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఆసిఫ్ అలీ అవార్డును తనకు అందజేయడానికి వచ్చినప్పుడు రమేష్ ప్రదర్శించిన అయిష్టత, ఆ తర్వాత స్టార్ హీరోని అవమానించిన తీరును చూసి అక్కడున్న గెస్ట్ లంతా అవాక్కయ్యారు. ఇక వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసి ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై నెటిజెన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Asif Ali: హీరోని పబ్లిక్‌గా అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్

- Advertisement -

రమేష్ నారాయణన్ ఎందుకలా చేశారంటే?

ఈ ఘటనపై తాజాగా డైరెక్టర్ జయరాజ్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి అలాంటి వీడియో ఒకటి సర్కులేట్ అవుతుందని తాను గమనించలేదని చెబుతూ అసలు అక్కడ ఏం జరిగిందో వివరించారు. మనోరతంగల్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిత్ర బృందం అందరినీ సత్కరించారని, కానీ రమేష్ నారాయణన్ ను మాత్రం వేదికపైకి పిలవలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలియజేయడంతో వారు ఆసిఫ్ అలీని పిలిచి బహుమతిని అందించారు. అయితే ఆసిఫ్ అలీ చేతి మీద నుంచి అవార్డును తీసుకున్న తర్వాతే రమేష్ నారాయణన్ నాకు ఫోన్ చేసి మళ్లీ నా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు అని వెల్లడించారు. అయితే మూవీ డైరెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే ఆయన ఇలా చేసి ఉండొచ్చని, ఆసిఫ్ అలీని అవమానించే ఉద్దేశంతో రమేష్ ఇలా చేసి ఉండకపోవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డైరెక్టర్ జయరాజ్. అంతేకాకుండా రమేష్ నారాయణన్ అలాంటి పని చేసే వ్యక్తి కాదంటూ ఆయన చేసిన పనిని సమర్థించారు.

మనోరతంగల్ లో దిగ్గజ నటులు

మనోరతంగల్ అనే ఆంథాలజీ మలయాళ దిగ్గజ రచయిత MT వాసుదేవన్ నాయర్ చిన్న కథల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాసిల్, బిజు మీనన్, ఆసిఫ్ అలీ వంటి అద్భుతమైన నటులు నటిస్తున్నారు. ఎనిమిది మంది దర్శకులు, అనుభవజ్ఞులైన మలయాళ నటీనటులంతా కలిసి ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు. జ్ఞానపీఠ్ అవార్డ్-విజేత రచయిత, స్క్రీన్ రైటర్-దర్శకుడు MT వాసుదేవన్ నాయర్ ఈ ప్రాజెక్ట్ ప్రతి భాగాన్ని ఒక ఐకానిక్ కథ ఆధారంగా రాశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు