SSMB29 : ఈసారి 3 పార్ట్స్ ప్లాన్ చేసారు, ఏ పార్ట్ లో ఎవరెవరు కనిపిస్తారు?

SSMB29 : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంచలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. ఎక్కడో ఉన్న తెలుగు సినిమాని శిఖరం మీద నిల్చోబెట్టిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళి ది అని చెప్పొచ్చు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక ప్లాప్ సినిమా కూడా తీయకుండా ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పటివరకు రాజమౌళి చేసిన హీరోలు అందరికీ కూడా మంచి స్టార్ డంను అందించాడు. కానీ ఆల్రెడీ స్టార్ డం ఉన్న హీరోతో మాత్రం చేయడం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. మహేష్ తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ సినిమాలు రీ రిలీజ్ అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఒక ప్లాప్ సినిమాతో కూడా అద్భుతమైన కలెక్షన్స్ను పెట్టగలిగే సామర్థ్యం ఉన్న నటులు వీళ్లిద్దరు.

Mahesh Babu

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. అయితే ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ప్రస్తుతం కొత్త కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి అయితే ఈ సినిమాను మొత్తం మూడు పార్ట్స్ గా చేయనున్నాడు ఎస్.ఎస్ రాజమౌళి. అయితే మొదటి పార్ట్ లో కేవలం మహేష్ బాబు మాత్రమే కనిపిస్తాడట, ఆ తర్వాత మిగతా పార్ట్స్ లో వేరే హీరోలు కూడా మహేష్ బాబు తో పాటు కలిసి కనిపిస్తారని టాక్ నడుస్తుంది.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాకి సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు మహేష్ బాబు కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా బయటికి వస్తే మరోసారి హాలీవుడ్ ఫిలిం యాక్టర్స్ తెలుగు సినిమా వైపు చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు