FilmFare 2024 : ‘బలగం’ బలం మళ్లీ చూపించే టైం… ఎన్ని క్యాటగిరిల్లో నామినేట్ అయిందంటే..?

FilmFare 2024 : టాలీవుడ్ లో 2023 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు గాను 2024 లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరగబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సినిమాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అవార్డులు ఇవ్వబోతున్నారు. ఇక గత సంవత్సరం వచ్చిన పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ ఏడాది నామినేషన్లలో సత్తా చాటాయి. అయితే ఈసారి పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు సత్తా చాటడం విశేషం. ఇకపోతే 2023 లో అత్యధికంగా నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు పలు కేటగిరీల్లో నామినేట్ అవడం విశేషం. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ఏడాది ఓ చిన్న సినిమా నామినేషన్స్ లో సత్తా చాటింది.

Balagam movie nominated in 7 categories in 2024 FilmFare Awards

బలగం బలం చూపిస్తుందా?

గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయం సాధించిన ‘బలగం’ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఇప్పుడు 2024 సంవత్సరానికి గానూ బలగం సినిమా ఏకంగా 7 కేటగిరీల్లో ఫిల్మ్ ఫేర్ (FilmFare 2024) నామినేషన్ అవడం విశేషం. పెద్ద సినిమాలకు ధీటుగా బలగం నామినేట్ కాగా, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో కూడా బలగం సత్తా చాటుతుందని అంటున్నారు నెటిజన్లు. కమెడియన్ వేణు యెల్దండి డైరెక్టర్ గా మారి చేసిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రాబట్టుకుని భారీ విజయం సాధించింది. టాలీవుడ్ బడా సెలెబ్రిటీల ప్రశంసలు పొందడమే కాక, పలువురు రాజకీయ నేతల నుండి కూడా మెప్పు పొందింది.

- Advertisement -

7 కేటగిరీల్లో నామినేషన్..

ఇక బలగం సినిమా ఏయే ఫిల్మ్ ఫేర్ అవార్డు కేటగిరీల్లో నామినేట్ అయిందో ఒకసారి పరిశీలిస్తే.. 2024 సంవత్సరానికి గాను బలగం నామినేషన్లు.. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ (వేణు యెల్దండి) , బెస్ట్ సపోర్టింగ్ రోల్ (రూప లక్ష్మి) , బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (భీమ్స్ సిసిరోలియో), బెస్ట్ లిరిసిస్ట్ (కాసర్ల శ్యామ్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ (రామ్ మిరియాల), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ (మంగ్లి) ఇలా ఏడు కేటగిరీల్లో బలగం సినిమా నామినేట్ అయింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన బలగం సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో కూడా సత్తా చాటుతుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు