Tollywood Actress : ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న హీరోయిన్లు ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఫ్యామిలి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటున్నారు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించింది.. ఈ మధ్య సినిమాలకు గుడ్ బై చెప్పేసి కేవలం ఫ్యామిలీని రన్ చేస్తుంది.. ఈమె కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది..
ఆమె ఎవరో కాదు నటి అర్చన.. ‘నేను’ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ అయిపోయింది. ఇక స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే అందుకోలేదు. తర్వాత గెస్ట్ రోల్స్, సహాయ నటి పాత్రలు చేసేసరికి ఈమె క్రేజ్ మరింత తగ్గిపోయింది.. సినిమాల్లో కనిపించలేదు.. బిగ్ బాస్ 1లో ఛాన్స్ కొట్టేసింది.. అక్కడ బాగానే ఆకట్టుకుంది కానీ విన్నర్ అవ్వలేక పోయింది.. ఆ తర్వాత తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది..
ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. కానీ టీవీ షోలల్లో మాత్రం కనిపిస్తూ వస్తుంది.. అయితే ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమాలో తన నటనకు గాను అవార్డు వచ్చింది.. ఆ అవార్డు ఇవ్వనని ఓ స్టార్ హీరో అన్నాడు.. అంతేకాదు మలయాళంలో కూడా ఓ హీరో అసభ్యంగా మెసేజ్ లు పెట్టేవాడు.. అది మర్చిపోలేను అని కొన్ని నిజాలను బయటపెట్టింది.. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి..