పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కొంటె కృష్ణుడిని గుర్తుపట్టారా.. నోట్లో వేలు వేసుకొని.. బోసి నవ్వులతో చూసే వారి హృదయాలను కొల్లగొట్టేస్తున్నారు.. ఇక ఈ చిన్నారి ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరో అంటే ఎవరైనా నమ్మగలరా.. అంతేకాదు వరుస సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఇటీవల రూ.1000కోట్ల క్లబ్లో చేరిపోయారు. పైగా సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. అంతేకాదు ఈ కృష్ణుడికి ఇంకా పెళ్లి కాలేదు. మరి ఎవరో ఇప్పటికే గుర్తుపట్టేసి ఉంటారు కదూ.. ఆయనే అందరూ అనుకుంటున్నట్టు రెబల్ స్టార్ ప్రభాస్..
ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటే.. మరి కొంతమంది వారి కుటుంబ సభ్యులు ఆ హీరోలకు , హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన.. ఈ చిన్ననాటి ఫోటో వైరల్ గా మారుతుంది.. కృష్ణుడి గెటప్ లో చాలా అద్భుతంగా ఉన్నాడు అంటూ అమ్మాయిలతో పాటూ హీరోయిన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ క్రేజ్ ప్రత్యేకం..
ఇకపోతే ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాఘవేంద్ర వంటి డివోషనల్ చిత్రాలతోనే కాకుండా ఈశ్వర్ వంటి మాస్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. అలాగే బిల్లా వంటి యాక్షన్ చిత్రాలలో కూడా నటించి అలరించిన ఈయన.. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి సినిమాలలో హోమ్లీగా కనిపించి తన లుక్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా చేసిన ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో హోదాను దక్కించుకున్నారు.. ఈ సినిమా తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు.
సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీ ఫాలోయింగ్..
బాహుబలి సినిమా తర్వాత తీసిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు చేశారు ప్రభాస్.. ఐతే ఈ సినిమాలు డిజాస్టర్ గా నిలిచినా.. వసూళ్ల పరంగా భారీగానే హిట్ అయ్యాయని చెప్పవచ్చు. అలాగే గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఫ్యూచర్స్టిక్ ఫిలిం కల్కి 2898AD సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రూ .600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు స్పిరిట్, రాజా సాబ్ , సలార్ 2 వంటి చిత్రాలను లైన్లో పెట్టారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్న ఈయన అంటే అటు సౌత్ హీరోయిన్స్ మాత్రమే కాదు నార్త్ హీరోయిన్లు కూడా పడి చచ్చిపోతారు.. మరి ఇంత క్రేజ్ అన్న ఈ కృష్ణుడికి ఇంకా వివాహం కాకపోవడం గమనార్హం. మరి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి.