Narayana Murthy : బ్రేకింగ్ న్యూస్.. నారాయణమూర్తికి అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిక..

Narayana Murthy :  ప్రముఖ తెలుగు నటుడు , నిర్మాత ఆర్ నారాయణమూర్తికి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ కు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఈ వార్త విన్న సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతనికి ఏమైందో తెలుసుకోవాలని ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

తాజాగా ఆయన ఆరోగ్యం దెబ్బ తినడంతో ఆయనను పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు.. ప్రస్తుతం నారాయణమూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆర్ నారాయణమూర్తి సన్నిహితులు ఈ విషయం తెలిపారు. అయితే ఆయనకు ఏమైంది, ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారని విషయం తెలుసుకున్న అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని కామెంట్స్ చేస్తున్నారు.. గతంలో ఇలాగే చాలా సార్లు ఆసుపత్రుల్లో చేరి కోలుకొని ఇంటికి వచ్చేసారు.. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..

R Narayana Murthy who was admitted to Nims Hospital due to health problems
R Narayana Murthy who was admitted to Nims Hospital due to health problems

ఇక నారాయణ మూర్తి సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు.. ప్రధాన పాత్రలో ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి, కొన్ని సినిమాలు నిర్మించి పీపుల్ స్టార్ గా ఎదిగారు. అయితే గతంలో మాదిరి అంత యాక్టివ్ గా లేకపోయినా ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు.. మరోవైపు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు