Katrina Kaif: కత్రినాకు ఆ ఊళ్ళో ప్రత్యేక పూజలు… ఎందుకో తెలుసా?

Katrina Kaif : హీరోయిన్లకు గుడులు కట్టి, దేవతల్లా పూజించడం అన్నది కొత్త విషయమేమీ కాదు. ఇదివరకు సౌత్ లో ఖుష్బూ, నమిత వంటి హీరోయిన్లకు ఇలా గుడి కట్టి ఆరాధించారు అభిమానులు. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను కూడా భారతదేశంలోని ఓ గ్రామంలో పూజిస్తున్నార. గత 11 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మరి కత్రినాను ఆ ఊళ్ళో ఎందుకు పూజిస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే..

11 ఏళ్లుగా కత్రినాకు పూజలు

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి సౌత్ ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెంకటేష్ సరసన మల్లీశ్వరి అనే సినిమా చేసి టాలీవుడ్ మూవీ లవర్స్ కు కూడా దగ్గరైంది. ఇక ప్రస్తుతం విక్కీ కౌశల్ ను పెళ్ళాడి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న కత్రినా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా కత్రినా తన 41వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే కత్రినాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. భారతదేశంలోని ఒక గ్రామంలో ఒక జంట గత 11 సంవత్సరాలుగా కత్రినాను పూజిస్తున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజును కూడా ఘనంగా జరుపుకున్నారు.

కత్రినా కైఫ్: 'ఈ' గ్రామంలో కత్రినా కైఫ్‌ను ఎందుకు పూజిస్తారు? చాలా ఏళ్ల తర్వాత నిజం బయటపడింది

- Advertisement -

హర్యానాలోని చర్కి దాద్రీ జిల్లాకు చెందిన ఓ జంట కత్రినాను రోజూ పూజిస్తారు. ధని ఫోగట్ గ్రామ నివాసితులు కరంబీర్ అలియాస్ బంటు, అతని భార్య సంతోష్ కత్రినా కైఫ్‌ను తమ దేవతగా పూజిస్తారు. గత 11 ఏళ్లుగా ఈ జంట కత్రినా పుట్టినరోజు వేడుకలకు కేక్‌లు కట్ చేసి, లడ్డూలు పంచి ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే వీళ్లకున్న కోరిక ఒక్కటే. కత్రినా తమను కలవాలని కోరుకుంటున్నారు. బంటు మాట్లాడుతూ ‘నేను 13-14 సంవత్సరాల వయస్సు నుండి కత్రినా పుట్టినరోజును జరుపుకుంటున్నాను. పెళ్లికి ముందు నేను ఒంటరిగా పుట్టినరోజు జరుపుకునేవాడిని. ఇప్పుడు నా భార్య, నేను కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. కత్రినా మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. కత్రినా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మమ్మల్ని కలవడానికి వస్తుందని నేను నమ్ముతున్నాను’ అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కత్రినాను పూజించే ఈ జంట గురించి చర్చ మొదలైంది.

ప్రెగ్నెన్సీ రూమర్లపై కత్రినా కైఫ్ క్లారిటీ

‘నమస్తే లండన్‌’, ‘వెల్‌కమ్‌’, ‘పార్ట్‌నర్‌’, ‘రేస్‌’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’, ‘రాజనీతి’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’, ‘ఏక్‌’ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది కత్రినా. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ లిస్ట్ లో ఉన్న కత్రినా ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అనంత్ అంబానీ పెళ్ళికి తన భర్తతో కలిసి హాజరైన ఈ బ్యూటీ అలాంటి వార్తలేమన్నా ఉంటే మేమే చెప్తాం అంటూ క్లారిటీ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు