Singer Palak Mucchal : యంగ్ సింగర్ పెద్ద మనసు… 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్

Singer Palak Mucchal : సెలబ్రిటీలు అనగానే కోట్లు సంపాదిస్తారు అనే ఆలోచన వస్తుంది. అయితే అలా కోట్లలో సంపాదించడానికి వెనుక వాళ్ళు పడిన కష్టం, టాలెంట్ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే అలా భారీగా సంపాదించే కొంతమంది ప్రముఖులు చేతనైనంత సాయం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటారు. ఆ లిస్ట్ లో తాజాగా యంగ్ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా చేరింది. ఈ సింగర్ 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి, ఎంతోమంది ప్రాణదాతగా మారింది.

3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు

ఇదివరకు టాలీవుడ్ లో మహేష్ బాబు పేద చిన్నారులకు సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్లు జరిపించి వార్తల్లో నిలిచారు. తాజాగా అచ్చం మహేష్ లాగే సింగర్ పాలక్ ముచ్చల్ కూడా చిన్నారుల గుండె ఆగిపోకుండా సొంతంగా చికిత్స చేయిస్తుండడం విశేషం. ఆమె దాదాపు 3 వేల మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించి వార్తల్లో నిలిచింది. ఈ విషయం గురించి పాలక్ మాట్లాడుతూ ప్రస్తుతం తన పాటలు హిట్ అవ్వడంతో రెమ్యూనరేషన్ బాగా పెరిగిందని, ఒక్క కాన్సర్ట్ తో 13 నుంచి 14 ఆపరేషన్లు చేయించడానికి సరిపడా డబ్బులు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికీ ఇంకా 3000 మందికే ఆపరేషన్లు జరగ్గా, ఇంకా 400 మంది కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లో ఉన్నారని వెల్లడించారు. ఈ చిన్నారులకే తన సంపాదన అంతా ఖర్చు చేస్తానని సంతోషంగా చెప్పుకొచ్చింది.

Palak Muchhal Celebrates Saving 3000 Lives with 'Saving Little Hearts'  Fundraiser - PUNE PULSEమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి…

మధ్యప్రదేశ్ లోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన పాలక్ డిగ్రీలో బీకాం పూర్తి చేసి సింగర్ గా మారింది. నిజానికి నాలుగేళ్ల వయసు అప్పుడే ఆమె యంగ్ సింగర్స్ గ్రూపులో సభ్యురాలుగా చేరిపోయింది. ఏడేళ్ల వయసు అప్పుడు కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల కుటుంబాల కోసం ఫండ్స్ సేకరించింది. దీనికోసం ఏకంగా వారం రోజుల పాటు ఇండోర్లోని పలు షాపుల ముందు పాటలు పాడి అప్పట్లోనే 25,000 సేకరించింది. దీంతో ఈ బ్యూటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆ తర్వాత అదే విధంగా ఒడిస్సాలో తుఫాను బాధితుల కోసం పాటలు పాడి విరాళాలు సేకరించింది.

- Advertisement -

చిన్నప్పటి నుంచి బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ కావాలని కలలుగన్న పాలక్ మచ్చల్ టీనేజ్ వయసు నాటికే 6 నాన్ ఫీల్మీ ఆల్బమ్స్ రిలీజ్ చేసింది. సల్మాన్ ఖాన్ ఆమె సేవా గుణాన్ని మెచ్చి ఏక్ థా టైగర్ సినిమాలో లాపతా సాంగ్ పాడించగా, సూపర్ హిట్ అయ్యింది. ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీలో కౌన్ తుఝే పాట కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆమెకు, ఆమె పాటలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూ ఉండడంతో రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. దీంతో జీవితాంతం కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని కూడబెట్టుకోవాలి వంటి ఆలోచనల్లో పడకుండా పేదలకు సాయం చేస్తోంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పాలక్ ఓవైపు పాటలు పాడుతూనే, మరోవైపు సేవా కార్యక్రమాలు చేపడుతుండడం ప్రశంసనీయం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు