MaheshBabu Birthday : జక్కన్న ఝలక్…. పాపం ఫ్యాన్స్ దీన్ని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు…

MaheshBabu Birthday : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులని పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీలో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా మహేష్ బాబు తన వన్ మ్యాన్ షో తో గట్టెక్కించి తన స్టామినా చూపించగా, రీసెంట్ సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. అయితే ఇప్పుడు మహేష్ అభిమానుల ద్రుష్టి అంతా ఎస్ఎస్ రాజమౌళి సినిమాపైనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం ఎప్పటినుండో అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ కాంబో సెట్ అయింది. ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే SSMB29 ని శ్రీ దుర్గ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో K.L.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

No updates from SSMB29 on Mahesh Babu Birthday

సినిమా కోసం మహేష్ బాబు స్టైలిష్ మేకోవర్…

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కి హాలీవుడ్ రేంజ్ లో బాలీవుడ్ నుండి ఎన్ని భారీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. ఇప్పుడు రాజమౌళి తో ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా చేయబోతున్నాడు. కనీవినీ ఎరగని తీరులో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకూ సినిమా మొదలుపెట్టకపోయినా, రాజమౌళి మాత్రం ఏడాది నుండి ఈ సినిమాపై ఫోకస్ పెట్టగా, గుంటూరు కారం రిలీజ్ కాగానే మహేష్ ని లుక్స్ పరంగా దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ని పెట్టి, డిజైన్ చేయించాడు జక్కన్న. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం దాదాపు నాలుగు నెలల నుండి లాంగ్ హెయిర్ ని మైంటైన్ చేస్తున్నాడు. స్టైలిష్ మేకోవర్ తో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. పైగా ఇప్పుడు జక్కన్న సినిమా కోసమే ఫస్ట్ టైం గడ్డం కూడా పెంచుతున్నాడు.

- Advertisement -

ఫ్యాన్స్ కి జక్కన్న ఝలక్.. బర్త్ డే కి నో అప్డేట్స్ …

ఇదిలా ఉండగా మహేష్ బాబు జక్కన్న సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ద్రుష్టి ఈ సినిమాపై పడింది. ఇక సినిమాకి సంబంధించి అఫిషియల్ గా షూట్ స్టార్ట్ కాకపోయినా, చాలా రోజులుగా అన్ అఫిషియల్ గా రాజమౌళి, మహేష్ బాబు స్క్రిప్ట్ విషయంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే (MaheshBabu Birthday) కి ఖచ్చితంగా సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఉంటుందని అనుకున్నారు మహేష్ ఫ్యాన్స్. కాని మహేష్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు జక్కన్న. ఈ ఏడాది మహేష్ బర్త్ డే కి ఎలాంటి అప్డేట్ ఉండదని జక్కన్న యూనిట్ నుండి సమాచారం వచ్చింది. ఈ న్యూస్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఊహించి కూడా ఉండరు. ఓవరాల్ గా మేకర్స్ నుండి బర్త్ డే విషెస్ తప్ప ఎలాంటి అప్డేట్ ఉండదని తెలుస్తుంది. మరి అసలు సినిమా అయినా ఎప్పుడు మొదలు పెడుతున్నారో చెప్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు