Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది.. కానీ విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.. అయితే సినిమాల కన్నా వివాదాలతో ఈ హీరో ఫేమస్ అవుతున్నాడు.. ఇక ఇప్పుడు విశ్వక్ భక్తి మోడ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.. తాజాగా ఆయన ఓ ప్రముఖ దేవాలయాన్ని సందర్శించారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో విశ్వక్ సేన్ చిలకూరు బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుగా, తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు.. అనంతరం భక్తులు ఆయనతో ముచ్చటించారు.. విశ్వక్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ తరలి వచ్చారు.. వారితో సెల్ఫీలు కూడా దిగినట్లు తెలుస్తుంది.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది..
Mass ka Das @VishwakSenActor visited chilukuru Balaji temple to seek blessings 😍#MassKaDas #VishwakSen #Laila #MechanicRocky #Tollywood #PopperStopTelugu pic.twitter.com/ZTGrir1Rof
— Popper Stop Telugu (@PopperstopTel) July 18, 2024
ఇక ఈయన ఈ మధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారు.. కల్కి సినిమా పై ఓ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూ పై మండిపడిన సంగతి తెలిసిందే.. ఆ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో చూశాం.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ విశ్వక్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేశాడు.. ప్రస్తుతం ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.. అందులో ఒకటి లైలా.. ఈ సినిమాలో విశ్వక్ లేడి గెటప్ లో కనిపించునున్నారు.. ఈ సినిమా పోస్టర్స్ ఈమధ్యే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. ఇక మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..