Star Heroin: 10 ఏళ్లకు పైగా ఆ స్టార్ హీరోయిన్ కు పూజలు..!

Star Heroine.. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ కి దేవాలయాలు నిర్మించి, అభిమానులు పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖుష్బూతో మొదలైన ఈ దేవాలయం.. నమిత , నిధి అగర్వాల్, సమంత ఇలా చాలామంది హీరోయిన్స్ కి దేవాలయాలు నిర్మించారు.. ముఖ్యంగా వీరిని దేవతలుగా భావించి కొంతమంది అభిమానులు పూజిస్తున్నారు కూడా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక హీరోయిన్ కు 11 సంవత్సరాల కు పైగా పూజలు అందిస్తూ.. తమ భక్తిని, అభిమానాన్ని చాటుకుంటున్నారు ఒక జంట. నిత్యం ఆమెకు పూజలు చేస్తున్నారు కూడా…

Star Heroin: Pooja to that star heroine for more than 10 years..!
Star Heroin: Pooja to that star heroine for more than 10 years..!

11 ఏళ్లుగా కత్రినాకు పూజలు..

తాజాగా కత్రినా కైఫ్ తన 41వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే మన దేశంలోని ఒక గ్రామంలో ఒక జంట దాదాపు 11 సంవత్సరాలుగా కత్రినాను పూజిస్తోంది.. ఆమె పుట్టిన రోజును కూడా చాలా ఘనంగా జరిపారు.. హర్యానాలోని చర్కీదాద్రి జిల్లాకు చెందిన ఒక జంట ప్రతిరోజు కత్రినాను పూజిస్తూ ఆమె దైవంగా భావిస్తున్నారు.. ధని ఫోగట్ అనే గ్రామంలో ఉండే కరంబీర్ అలియాస్ బంటు అతడి భార్య సంతోషి.. కత్రినా కైఫ్ ను తమ దైవంగా పూజిస్తున్నారు. గత 11 ఏళ్లుగా ఈ జంట ఆమెకు పుట్టినరోజు వేడుకల రోజున కేక్ కట్ చేసి, లడ్డూ పంచి ఘనంగా జరుపుకున్నారు. అంతేకాదు తమను కలవడానికి కత్రినా కైఫ్ రావాలని కోరుతున్నారు కూడా.

బంటూ మాట్లాడుతూ..

ఇక బంటు మాట్లాడుతూ.. నేను 14 ఏళ్ల నుంచి కత్రినా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాను.. పెళ్లికి ముందు నేను కత్రినా పుట్టినరోజును ఒంటరిగా జరుపుకునే వాడిని.. ఇప్పుడు నేను నా భార్య కలిసి ఆమె పుట్టినరోజుని జరుపుతున్నాము.. కత్రినా మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను.. కత్రినా తప్పకుండా మమ్మల్ని కలవడానికి వస్తుందని కూడా మేము భావిస్తున్నాము అంటూ బంటు చెప్పుకొచ్చారు.

- Advertisement -

సంతోషీ మాట్లాడుతూ..

అలాగే బంటు భార్య సంతోషి మాట్లాడుతూ.. ఇటీవలే కత్రినాకు 41 ఏళ్లు పూర్తి అయ్యాయి.. మేము ఆమె పుట్టిన రోజు చాలా ఘనంగా జరిపాము. త్వరలోనే ఆమె మమ్మల్ని కలవాలని ప్రార్థిస్తున్నాను. గత 11 ఏళ్లుగా ప్రతిరోజు ఆమెకు పూజలు చేస్తున్నాము అంటూ సంతోషి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ జంట కత్రినా తమను కలవాలని కోరుకుంటున్నారు.. మరి కత్రినా వరకు ఈ విషయం చేరే వరకు.. షేర్ చేయాలని వారి అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . మరి ఏ మేరకు ఈ విషయం కత్రినా వరకు వెళ్తుందో.. వెళ్తే ఈ జంటను కలవడానికి వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కత్రీనా కెరియర్..

తెలుగులో మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్.. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు