Jabardasth Varsha.. జబర్దస్త్ కామెడీ షో లో అత్యంత గ్లామర్ గా ఉన్న బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది వర్ష మాత్రమే అని చెప్పవచ్చు.. అయితే తనపై నెగటివ్ ట్రోల్స్ వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా.. తనదైన అంద చందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మానుయెల్ తో స్కిట్స్ చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెరపై లవర్ లా కనిపిస్తూ.. వీరు చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ జంటకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరి స్కిట్ కోసం జబర్దస్త్ చూసే వారు కూడా లేకపోలేదు.. అంతలా ఇప్పుడు వీరిద్దరూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
జబర్దస్త్ వర్ష..
ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ షో లో వీరిద్దరి స్కిట్ కి సంబంధించిన తాజా ప్రోమో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో వర్షా చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.. మరి ఏం జరిగిందనే విషయానికి వస్తే.. స్కిట్ లో వర్ష భర్త రియాజ్.. ఆయన అర్ధరాత్రి 12 తర్వాత పెద్దగా మారిపోతాడు.. ఈ క్రమంలో తాను చిన్నగా ఉన్నప్పుడు వర్ష వద్దకు వెళ్లి.. మనం శోభనం చేసుకుందాం అని అడిగితే.. వర్ష నో చెబుతుంది. దీంతో రియాజ్ నేను రాత్రి 12 దాటితే పెద్దగా అయిపోతాను అంటూ తన రహస్యాన్ని బయట పెట్టాడు.. అలా నైట్ 12 తర్వాత రియాజ్ కాస్త ఇమ్మానుయేల్ అవుతాడు. దీంతో వర్ష తన భర్తను హగ్ చేసుకుంటుంది.. ఆ తర్వాత బయటకు వచ్చిన వర్ష ను చూసిన భర్త ఏం చేస్తున్నావ్ లోపల అంటూ గట్టిగా అరుస్తాడు. మీకోసమే నండీ రెడీ అవుతున్నాను అంటూ తెలుపుతుంది..
అర్ధరాత్రి 12 తర్వాత వర్ష అలాంటి పని చేస్తుందా..
దీంతో ఇమ్మానియేల్ తన సిగరెట్టుతో వర్ష ను కాల్చే ప్రయత్నం చేయగా.. వర్ష తన పైట తీసి అబ్బా ఇక్కడ కాల్చండి.. అక్కడ కాల్చండి అంటూ రొమాంటిక్ గా అంటుంది.దీంతో ఇమ్మానుయేల్ నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నావ్.. సిగరెట్ తాగుతున్నా.. కాఫీ ఏం తాగట్లేదు అంటూ చెబుతారు..ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఇది చూసిన కొందరు ఏంటి వర్షకు రాత్రి సమయంలో సిగరెట్‌తో కాల్చుకునే అలవాటు ఉందా అంటూ కూడా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వర్ష కి సంబంధించిన ఈ స్కిట్ ఇప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు..
వర్ష కెరియర్..
ఇక వర్ష విషయానికి వస్తే.. ఒకప్పుడు కొన్ని సీరియల్స్ లో పనిమనిషిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.. అంతేకాదు కొన్ని సీరియల్స్ లో విలన్ గా కూడా మెప్పించింది.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి తన ఫేట్ మార్చుకుంది. ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యి తన గ్లామర్ తో యువతను ఆకట్టుకోవడమే కాదు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా వర్షాకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.