90’s A Middle Class Biopic : 90స్ వెబ్ సిరీస్ ప్రియులకు గుడ్ న్యూస్…నెక్స్ట్ సీజన్ వచ్చేస్తుంది..

90’s A Middle Class Biopic : ప్రముఖ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’. హీరోగా వరుస పరాజయాలు అందుకున్న శివాజీ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ జనాలకు చేరువైన తర్వాత నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఈటీవి విన్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలై ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒక ఫన్ & ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మధ్య తరగతి కుటుంబాలకి చెందిన జీవితాలను, కష్టాలను ఇందులో కళ్ళకి కట్టినట్టు చూపించారని చెప్పాలి. ఈ సిరీస్ లో శివాజీ ఒక మధ్యతరగతి తండ్రిగా జీవించాడని చెప్పాలి. ఇక ఈ వెబ్ సిరీస్ తెలుగు సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, సాలిడ్ వ్యూస్ తెచ్చుకుని ఆడియన్స్ ని ఇప్పటికి మెప్పిస్తుంది.

90's A Middle Class Biopic as the best web series in India

అరుదైన రికార్డు సాధించిన మిడిల్ క్లాస్ బయోపిక్…

ఇక 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ (90’s AMiddle Class Biopic : ) వెబ్ సిరీస్ లో నటుడు శివాజీ తో పాటు, వాసుకి ఆనంద్, మౌళి, అనిల్, వాసంతిక, సిద్దార్థ్, రోహన్ రాయ్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ రచించి దర్శకత్వం వహించాడు. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జరిగే కొన్ని సంఘటనలను అత్యద్భుతంగా, హృదయానికి హత్తుకునేలా చూపించాడు దర్శకుడు ఆదిత్య హాసన్. ఇక సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది సిరీస్ కి ప్లస్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా “90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్” వెబ్ సిరీస్ మరో అరుదైన ఘనత సాధించింది. తెలుగు నాట ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా #90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ భారతదేశంలోనే బెస్ట్ వెబ్ సిరీస్ గా ఇప్పుడు గుర్తింపు పొందింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

- Advertisement -

నెక్స్ట్ సీజన్ వచ్చేస్తుంది..

ఇదిలా ఉండగా 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తున్న ఈ వెబ్ సిరీస్ నుండి త్వరలోనే రెండో సీజన్ రాబోతుంది. అలాగే మూడు సీజన్ కూడా చిన్న గ్యాప్ లోనే వస్తుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. 2025 జనవరిలో రెండో సీజన్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన శివాజీ సహా పలువురు నటీనటులు ఇప్పటికే సినిమాల్లో మంచి ఆఫర్లు అందుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు