Nawazuddin Siddiqui : ‘డబ్బుల కోసమే’ సిగ్గులేకుండా చెబుతున్నా… బాలీవుడ్ స్టార్ భావోద్వేగ కామెంట్

Nawazuddin Siddiqui.. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన చిత్రం సైంధవ్.. రుహాని శర్మ , ఆండ్రియా జెర్మియా , నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు.. ఇక ఈ సినిమా పర్వాలేదనిపించుకున్నా.. ఈ సినిమాతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి.. అందుకే టాలీవుడ్ లో పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.. బాలీవుడ్ తో పోల్చుకుంటే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పారితోషకం ఇస్తున్నారని చెప్పిన ఈయన..కానీ ఆ పారితోషకానికి తగ్గట్టుగా న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుగా ఉంది అంటూ కామెంట్ లు చేశారు.. దీంతో పారితోషకం విషయంపై ఈయన చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరచడమే కాదు ఆలోచింప చేస్తున్నాయని చెప్పాలి.

Nawazuddin Siddiqui: Shameless to say.. I work only for money.. Nawazuddin emotional comment..!
Nawazuddin Siddiqui: Shameless to say.. I work only for money.. Nawazuddin emotional comment..!

డబ్బుల కోసం పనిచేస్తున్నందుకు సిగ్గుగా ఉంది..

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు . .. చేశారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈయన మాట్లాడుతూ.. డబ్బు సంపాదించడం కోసం నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.. నటన పైన ఉన్న ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ మేరకే నా వద్దకు వచ్చిన ప్రతి పాత్రకి కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ.. సినీ ప్రేమికులను అలరిస్తున్నాను. అయితే రామన్ రాఘవ్ లాంటి చిత్రాలలో నటించినప్పుడు పాత్రకు సంబంధించిన భావోద్వేగాలు, ఆలోచనలపై నాకు పట్టు ఉంటుంది. కానీ దక్షిణాది చిత్రాలలో నటించినప్పుడు ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పలేను.. ఇక్కడ మంచి పారితోషకం ఇస్తున్న కారణంగా ఆయా పాత్రలలో నటిస్తున్నాను.. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. పాత్రలపై పూర్తి నియంత్రణ ఉండడం లేదు.. నేను ఏం చేయాలనే దాన్ని చిత్రీకరణ ముందు మరో వ్యక్తి వివరించాల్సి వస్తోంది. అయితే ఇక్కడ ఇంత మంచి పారితోషకం నేను తీసుకుంటున్నప్పటికీ కూడా పాత్రకు సరైన న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను… అంటూ తెలిపారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నవాజుద్దీన్ సిద్ధిఖీ కెరియర్ ఆరంభం..

1999లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కోర్స్ పూర్తయిన తర్వాత టీవీ సీరియల్స్ లో అవకాశాన్ని దక్కించుకోవడానికి ముంబైకి వెళ్ళాడు. అయితే అక్కడ 1999లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సర్ఫారోష్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చానని స్పష్టం చేశారు. పలు చిత్రాలలో నటించిన ఈయన నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా.. తొలిసారి బోలె చుడియాన్ చిత్రంలో పాట పాడి గాయకుడిగా తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు