Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టైం ఇప్పుడు అంత బాగోలేదన్న సంగతి తెలిసిందే.. ఈ మధ్య ఈమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బాస్టర్ కాదు కదా కనీసం హిట్ అవ్వలేదు. ఇటు తెలుగులోనే కాదు .. బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస ఫ్లాప్ సినిమాలే పలకరించాయి. రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాలో నటించింది. ఆ సినిమా వచ్చిన రోజునే మిక్స్డ్ టాక్ ను అందుకుంది. సినిమాల మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కూడా బ్యాడ్ గానే ఉంది. తన తమ్ముడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ కేసులో ఈమె పేరు కూడా వినిపిస్తుంది. అలాగే కమల్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నట్లు తెలుస్తుంది.
రకుల్ నటించడం వల్లే సినిమా భారీ డిజాస్టర్ అయ్యిందని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో రకుల్ పేరు వింటేనే మేకర్స్ భయపడుతున్నారు. గతంలో ఈ బ్యూటీ చేసిన సీక్వెల్ మూవీస్ అన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. రవితేజ కిక్ 2 , నాగార్జున మన్మథుడు 2 , భారతీయుడు 2. ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిసి శంకర్ భారతీయుడు 2 కు తీసుకున్నాడా అంటూ కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె పేరు వింటేనే ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరో సినిమా అవకాశం ఇవ్వాలంటే మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.
ఇకపోతే రకుల్ తెలుగులో దాదాపు ఫెడ్ అవుట్ అయినట్లే కనిపిస్తుంది. ఇక కోలీవుడ్ లో పలు సినిమాలు చేసిన అక్కడ ఒక్క సక్సెస్ కూడా పడలేదు. ఇక బాలీవుడ్ లో వరుసగా సీనియర్ హీరోలతో నటించింది కానీ అక్కడ కూడా అనుకున్న హిట్ ను సొంతం చేసుకోలేక పోయింది. రకుల్ గ్రాఫ్ చూసుకుంటే ఏమాత్రం బాగోలేదని తెలుస్తుంది. మొత్తానికి ఐరన్ లెగ్ హీరోయిన్ అయ్యింది. గత నాలుగేళ్లుగా ఫ్లాప్ సినిమాలే ఈమె ఖాతాలో పడ్డాయి. రకుల్ మళ్లీ గట్టిగా కమ్ బ్యాక్ ఇస్తే తప్పా రూమర్స్ కు చెక్ పెట్టడం కష్టమే..