Salman Khan.. బాలీవుడ్ కండల వీరుడిగా భారీ గుర్తింపు సొంతం చేసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి, ఆయన రిచ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సల్మాన్ ఖాన్ ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. కానీ ఎంతో మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపిన విషయం తెలిసిందే. ఈయన చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ నడపడమే కాదు.. వాళ్ళందరికీ కూడా లగ్జరీ బహుమతులను ఇస్తూ తనను తాను నిరూపించుకున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ ఎంత ధనవంతుడు అనే విషయాన్ని ఆయన ధరిస్తున్న వస్తువులు , దుస్తులే మనకు నిరూపిస్తూ ఉంటాయి.
అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో అందర్నీ ఆకర్షించిన సల్మాన్ ఖాన్..
ఈ క్రమంలోనే అనంత్ అంబానీ -;రాధికా మర్చంట్ వివాహ వేడుకలలో అందరి దృష్టిని ఆకర్షించేలా సల్మాన్ ఖాన్ తన చేతికి ధరించిన వాచ్ ఆయన రిచ్ నెస్ ను నిరూపించడమే కాదు.. దాని ధర తెలిసి , ఆయన ధరించిన ఆ వాచ్ ఖరీదుతో ఏకంగా ఒక ఊరినే దత్తత తీసుకోవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ఖరీదు రూ.23 కోట్లు..
ఇక అసలు విషయంలోకెళితే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల జూలై 12వ తేదీన జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఫంక్షన్ లేదా వేడుకలలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ కుర్తా సెట్ లో అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సల్మాన్ ఖాన్.. తాను ధరించిన వాచ్ తో అందరి దృష్టిని లాగేసుకున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ ఈ ఫంక్షన్ లో ధరించిన వాచ్ ధర అక్షరాల రూ.23 కోట్లు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వాచ్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వాచ్ ప్రత్యేకతలు ఏమిటంటే..
ఈ పెళ్లి వేడుకలలో సల్మాన్ ఖాన్ రూ.23 కోట్ల విలువైన పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ లూస్ రెయిన్బో హాట్ జ్యువెలరీ వాచ్ ను ధరించారు. ఈ వాచ్ డయల్ 130 బాగెట్ కట్ వజ్రాలతో అలకరించబడింది. ఈ బాగెట్ కట్ నీలమణి పై 779 రకాల కలర్స్ ఇంద్రధనస్సును తలపిస్తున్నాయి.. డైమండ్, రూబీ సెట్, బ్లూ సఫైర్ వంటి పన్నెండు రకాల నీలమణులతో ఈ వాచ్ తయారు చేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ వాచ్ ఏకంగా 23 కోట్ల ధర పలుకుతోందని సమాచారం .
వాచ్ కలెక్షన్స్ లో ఇదే ఖరీదైనది..
ఇకపోతే బ్లాక్ కుర్తా సెట్ ధరించిన సల్మాన్ ఖాన్ ఈ వాచ్ ధరించి చాలా హుందాగా వివాహ వేడుకలకు హాజరయ్యారు.. ముఖ్యంగా ఈయన లుక్ కంటే ఈయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. నిజానికి సల్మాన్ ఖాన్ కు వాచ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం . ఈయన దగ్గర ఎన్నో రకాల విలువైన వాచ్ కు ఉన్నాయి. వాటిల్లో ఇది అత్యంత విలువైనదని సమాచారం.ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ తన అభిరుచి కోసం ఏకంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.