Narne Nithiin: నేనో చీప్ లత్కోర్ గాడినని మా ఫ్రెండ్స్ ని అడిగితే చెప్తారు

Narne Nithiin: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నర్నె నితిన్ ఒకరు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన మాడ్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు నితిన్. అయితే మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు అని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమా క్రెడిట్ చాలా మందికి దక్కుతుంది. ఈ సినిమాను చాలా అద్భుతంగా డీల్ చేశాడు శంకర్. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని లాజిక్స్ పెద్దగా పట్టించుకోకుండా కేవలం వినోదం మాత్రమే కీలకమైన అంశంగా తీసుకొని ఆ సినిమా ను తీశాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతాడు కళ్యాణ్ శంకర్ అని అందరు అనుకున్నారు. నవీన్ పోలిశెట్టికి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్టు కాస్త డిలే అయింది. ఈ ప్రాసెస్ లో వేరే కథ ఏదైనా ఉంటే చెప్పు అని నిర్మాత నాగవంశీ అడిగినప్పుడు మాడ్ స్టోరీ అని చెప్పాడు. కథ విపరీతంగా వంశీకి నచ్చడంతో ఆ సినిమాను కూడా త్వరగా తీశారు. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన నితిన్ ఇప్పుడు ఆయ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Narne Nithiin

- Advertisement -

గోదావరి ప్రాంతంలో ఆయ్ అనే పదం ఎంత పెద్దగా పాపులర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటకు ముందు మాటకు తర్వాత ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇదే టైటిల్తో సినిమాను చేస్తున్నారు. సినిమాలో నితిన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మేం బేసిక్ గా ఇలానే ఉంటాము. నేను కొంచెం హై ఫ్యామిలీ నుంచి రావటం వలన నేను మీకు ఇలా కనిపిస్తున్నాను. కానీ ఫ్రెండ్స్ నేనో చీప్ లత్కోర్ గాడినని మా ఫ్రెండ్స్ ని అడిగితే చెప్తారు అంటూ సమాధానం ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు