ShivaReRelease : నాగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. శివ మళ్ళీ వచ్చేస్తున్నాడు..

ShivaReRelease : టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాలుగా అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నటవారసుడిగా ఇప్పటికీ విశేషంగా అలరిస్తున్నాడు. ఇప్పుడు తన వారసులు కూడా తండ్రి బాటలో పయనిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున సినీ కెరీర్ లో ఎప్పుడైనా సరే.. శివ ముందు ఆ తర్వాత అంటారు.. ఎందుకంటే ఆ సినిమాతోనే నాగార్జున సినీ కెరీర్ టర్న్ అయిపోయింది. టాలీవుడ్ లోనే ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిన ఆ సినిమా ఇప్పటికీ ఎవరు గ్రీన్ క్లాస్సిక్ అని అంటుంటారు మూవీ లవర్స్. ఇక ఆ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడని తెలిసిందే.

Nagarjuna's Shiva movie re-releasing on August 29th

ట్రెండ్ సెట్టర్ శివ…

ఇక శివ సినిమా నాగార్జున హీరోగా 1989 లో విడుదలవగా ఆరోజుల్లో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుని కూడా లాంగ్ రన్ లో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలో అద్భుతమైన కథ ఏమైనా ఉంటుందా అంటే మనకి తెలియునా కథలే. ఒక నార్మల్ కాలేజీ స్టూడెంట్ గా ఫ్రెండ్స్ తో అలా చదువుకుంటూ సరదాగా ఉండే శివ, భవాని అనే రౌడీ గ్యాంగ్ కాలేజీలో చేసే రౌడీయిజాన్ని ఎలా అడ్డుకున్నాడనేది కథ. అయితే శివ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. రియలిస్టిక్ సౌండ్స్, విజువల్స్ తో స్టైలిష్ ఫైట్స్ తో రామ్ గోపాల్ వర్మ ఎక్స్ట్రార్డినరీ స్క్రీన్ ప్లే రైటింగ్ తో ఓ రేంజ్ లో అభిమానుల్ని ఆకట్టుకుంది శివ సినిమా. శివ లో ఒక్క సైకిల్ చైన్ సీన్ చాలు సినిమా రేంజ్ చెప్పడానికి. అప్పట్లో ఎన్నో రోజులు కాలేజ్ యూత్ చైన్లు పట్టుకుని తిరిగేవారట. ఇప్పుడు ఈ ట్రెండ్ సెట్టింగ్ మూవీ రీ రిలీజ్ అవుతుంది.

- Advertisement -

నాగ్ బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్..

శివ సినిమాను నాగార్జున బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 29న రీ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం వచ్చింది. ఆల్రెడీ శివ సినిమా (ShivaReRelease) 4k ప్రింట్ కూడా రెడీ అయిందని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. మొన్నా మధ్య శివ చైన్ సీన్ ని పేస్ మార్ఫింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పెట్టినప్పుడే శివ సినిమా రీ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అఫిషియల్ గా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే రీ రిలీజ్ ట్రైలర్ తో అనౌన్స్ చేయనున్నారు. ఇక శివ కోసం అప్పటిలాగే ఇప్పుడు కూడా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారనే మాట వాస్తవం. మరి రీ రిలీజ్ లో కూడా శివ ట్రెండ్ సెట్ చేస్తాడా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు