Jr. NTR.. స్వర్గీయ నందమూరి తారక రామారావుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక్.. అనతి కాలంలోనే తాతకు తగ్గ మనవడిగా పేరు సొంతం చేసుకున్నారు వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తారక్ తన అద్భుతమైన నటనతో యువతను ఆకట్టుకోవడమే కాదు స్టార్ హీరోయిన్లు మొదలుకొని యంగ్ హీరోయిన్ల వరకు ఈయనను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అంతేకాదు ఈ హీరోయిన్లు కూడా అవకాశం వచ్చినప్పుడు, సందర్భం అనిపించినప్పుడు తప్పకుండా తారక్ పై తమ క్రష్ ను బయటపెడుతూ ఉంటారు. ఇకపోతే తారక్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుని , ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.. దేవర సినిమాతో తన ఇమేజ్ ని మరింత రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తారక్ పై తన క్రష్ బయట పెట్టిన స్టార్ హీరోయిన్..
ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఈయనకు భారీ పాపులారిటీ పెరిగింది. అందుకే ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా తారక్ నటనను ఇష్టపడుతున్నారు. అలా మన ఇండియాలో కూడా ఉన్నారు అందులో సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. తారక్ యాక్టింగ్ ని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ఆయన డాన్స్ లకు ఫిదా అవుతుంటారు. తమ ఫేవరెట్ స్టార్ హీరోగా చెబుతూ ఉంటారు . ఈ క్రమంలోని ఒక స్టార్ హీరోయిన్ తారక్ పై తనకున్న ప్రేమను బయటపెట్టేసింది. ఆమె ఎవరో కాదు ఖుష్బూ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తారక్ పై తనకున్న క్రష్ ను బయట పెట్టేసింది.
తారక్ ని చూస్తే అలాంటి ఫీలింగ్ కలుగుతుంది..
తారక్ అంటే ఫ్యాన్ మూమెంట్ అని, ఆయనను చూస్తే అలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మీ ఫ్యాన్ మూమెంట్ ని పంచుకోమని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అరవింద స్వామిని చూసినప్పుడు తనకు ఫ్యాన్ మూమెంట్ అనిపిస్తుందని, అలాగే కమల్ హాసన్ ని కలిగినప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని, అంతేకాదు తారక్ ను చూసినప్పుడు, కలిసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ మూమెంట్ ని చెప్పుకోవడానికి ఆగలేకపోతున్నాను అంటూ తన ఆతృతను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తారకు మంత్రముగ్దులైన సెలబ్రిటీస్..
ఇప్పుడున్న స్టార్ హీరోలలో చాలామంది తారక ను ఇష్టపడతారు.. సీనియర్లను మొదలుకొని జూనియర్ల వరకు చాలామందికి తారక్ నటన , డాన్స్ అంటే చాలా ఇష్టం.. రంభ కూడా తారక్ డాన్స్ కి మంత్రముగ్ధురాలని అయిపోయానని చెప్పింది .నయనతార, రష్మిక మందన్న కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ కూడా గతంలో ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ను ఫిదా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఎన్టీఆర్ పై తమ ప్రేమను ఒక్కొక్కరు బయటపెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఏది ఏమైనా తారక్ పై ఖుష్బూ అలాంటి కామెంట్లు చేయడం ఆశ్చర్యకరమని చెప్పవచ్చు…