JaraRaj : ప్రముఖ సింగర్‌ జయరాజ్‌కు గుండెపోటు… ఐసీయూలో చికిత్స

ప్రముఖ తెలుగు కవి, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురైయ్యారు.. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆయనకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది.. ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు..

జయరాజ్ ఈరోజు ఉదయం గుండెపోటుకు గురైయ్యారు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఆయనకు ప్రస్తుతం పంజాగుట్ట లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఐసీయూకు మార్చి వైద్యాన్ని అందిస్తున్నారు.. ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు వైద్యులు వెల్లడించారు.. త్వరలోనే కోరుకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు.. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షలేని సమాజం కోసం కృషి చేశారు. బుద్ధుడి బోధనల ప్రభావం ఆయనపై చాలానే ఉంది. అంబేదర్‌ రచనలతో స్ఫూర్తి పొందారు. ఈయన ఒక ఉద్యమకారుడు.. తన గొంతుతో జనాల్లో ఉత్తేజాన్ని రేకేత్తించారు.. ఈయన పల్లెల్లో తిరుగుతూ తన ఆటపాటలతో ప్రజలను అలరించారు.. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు. ఈయన సాహిత్యం గురించి అందరికీ తెలుసు.. తెలుగు ప్రజలు ఆయన కవితలకు ముగ్దులయ్యారు..

- Advertisement -

ఈయన కళారంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.. పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను గాయకుడు జయరాజ్‌ను వరించిన సంగ‌తి తెలిసిందే.. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి గురించి విన్న ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు