H.Vinoth: తలపతి విజయ్ 69 కథ విషయంలో కమల్ హాసన్ ఇన్వాల్వ్మెంట్

H.Vinoth: శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు తలపతి విజయ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట గా నిలిచింది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన త్రీ ఇడియట్స్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత విజయ నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చాయి.

స్నేహితుడు సినిమా తర్వాత విజయ్ ది తెలుగులో రిలీజ్ అయిన సినిమా తుపాకీ. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు ఏఆర్ మురగదాస్. ఈ సినిమా మహేష్ బాబు లాంటి హీరోకి పడి ఉంటే అద్భుతమైన హిట్ అయ్యేదని అందరూ అంటుంటారు.

ఇకపోతే ఆ తర్వాత విజయ్ సినిమాలు కూడా తెలుగులో అనువాదంగా రిలీజ్ అయ్యాయి. కానీ అవన్నీ అంతంత మాత్రమే ఆడాయి అని చెప్పొచ్చు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన అదిరింది విజిల్ వంటి సినిమాలు ఇక్కడ మంచి ఆదరణ పొందుకున్నాయి. ఖైదీ సినిమాతో లోకేష్ కనకరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అక్కడితో లోకేష్ కనకరాజ్ సినిమా వస్తుంది అనంటే తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడం మొదలెట్టారు. ఇకపోతే రీసెంట్ గా వచ్చిన లియో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది.

- Advertisement -

H. Vinod

ఇక విజయ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తలపతి విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 69వ సినిమాను చేయనున్నాడు. ఇక ఇప్పటివరకు వినిపిస్తున్న కథనాలు ప్రకారం ఇదే విజయ్ కి చివరి సినిమా కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కథను మొదట కమల్ హాసన్ కు చెప్పాడు వినోద్. ఈ సినిమాను కమల్ హాసన్ తోనే చేయాలి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. అయితే కమల్ హాసన్ ఈ సినిమాలో కొన్ని మార్పులను చెప్పాడు. ఆ మార్పులను చేసిన తర్వాత ఈ కథను తీసుకెళ్లి విజయ్ కు చెప్పాడు. ప్రస్తుతం విజయ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే ఈ కథ క్రెడిట్ విషయంలో కేవలం హెచ్ వినోద్ కి మాత్రమే కాకుండా కమలహాసన్ కూడా క్రెడిట్ ఉంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు