RGV : పక్కింటోడి పెళ్ళాం ఆమెలా కన్పిస్తే ? స్టార్ హీరోయిన్ ను మధ్యలోకి లాగుతూ ఆర్జీవీ పెళ్లి పాఠాలు

RGV : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తాడు అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ స్టార్ హీరోయిన్ ను మధ్యలోకి లాగుతూ నెటిజన్లకు ప్రేమ, పెళ్లి పాఠాలు చెప్పడం చర్చకు దారి తీసింది. పక్కింటోడి పెళ్ళాం ఆమెలా కనిపిస్తే ఏం చేస్తారు ? అంటూ సదరు హీరోయిన్ పేరు మెన్షన్ చేసి మరీ వరుసగా ట్వీట్ ల ద్వారా ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు రాంగోపాల్ వర్మ.

భార్య కంటే నర్సే బెటర్

ఆర్జీవి తాజా పోస్టులలో వివాహాలు నరకంలో జరుగుతాయి, విడాకులు స్వర్గంలో జరుగుతాయి అంటూ పెళ్లితో సమస్య ఎంతో వివరించారు. ఇప్పుడు జరుగుతున్న వివాహాలు వాస్తవంగా తల్లిదండ్రులు చేసే పెళ్ళిళ్ళు కొనసాగినన్ని రోజులు కొనసాగుతున్నాయా అని నేను ఆశ్చర్యపోతున్నాను. వృద్ధాప్యంలో చూసుకోవడం కోసం వివాహం చేసుకోవడం కంటే పెయిడ్ నర్సు చాలా బెస్ట్ ఆప్షన్. నర్స్ దానిని జీతంతో చేసే ఉద్యోగంగా చేస్తుంది. అయితే భార్య వృద్ధుడికి శాశ్వతంగా అపరాధ భావాన్ని కలిగిస్తుంది. అలాగే అబ్బాయిలు సెక్స్ కోసం ప్రేమగా నటిస్తారు. కానీ అమ్మాయిలు ప్రేమను పొందడానికి సెక్స్ నటిస్తారు. ఇది వివాహానికి సంబంధించిన ప్రాథమిక సమస్య. ప్రేమ అంధత్వం అయితే వివాహం కళ్ళు తెరవడం లాంటిది అంటూ రాసుకొచ్చారు.

అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవాలి

ఒకే వ్యక్తితో మళ్లీ మళ్లీ ప్రేమలో పడే అసాధారణ సామర్థ్యం మీకు ఉంటేనే వివాహం అనేది పని చేస్తుంది. ఈ రోజు విడాకుల రేటు ఎక్కువగా ఉన్నందున, పెళ్లి కోసం ముక్కుపిండి ఖర్చు చేసే పేద తల్లిదండ్రులే అతిపెద్ద మూర్ఖులు. మీ పొరుగువారి భార్యను కోరుకోవద్దు అని చెప్పడం చాలా సులభం… కానీ ఆమె మేగాన్ ఫాక్స్ లాగా, మీ భార్య మీ భార్యలా కనిపిస్తే ఎలా ఉంటుంది ? అంటూ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వచ్చారు ఆర్జీవి.

- Advertisement -

Megan Fox deletes her Instagram hours after hinting at break up with  Machine Gun Kelly

ఆ హీరోయిన్ కి కూడా మొగుడు ఉన్నాడు

ఇక సోషల్ మీడియాలో ఆర్జీవి పోస్ట్ చేయడమే ఆలస్యం అసలు ఇటీవల కాలంలో దంపతులు పెళ్లి చేసుకున్నాక ఎందుకు విడాకుల దాకా వెళ్తున్నారు ? అనే విషయాలను చర్చిస్తున్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ప్రేమ, పెళ్లి గురించి ఇంత ఉపదేశం చేశారో గానీ, రామ్ గోపాల్ వర్మ చెప్పింది అక్షర సత్యం. అయితే కొంతమంది మాత్రం అమెరికన్ హాట్ బాంబ్ మేగన్ ను మధ్యలోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కూడా మొగుడు ఉన్నాడు. మీరు ఆయన భార్య గురించి ఆలోచిస్తే, ఆయన మీ భార్య గురించి ఆలోచిస్తాడు అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇటీవల విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు

తాజాగా సెలబ్రిటీ హార్దిక్ పాండ్య, నటాష డీవోర్స్ తీసుకున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. ధనుష్ ఐశ్వర్య, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ – సైంధవి కూడా రీసెంట్ గా డీవోర్స్ తీసుకున్న జంటల లిస్ట్ లో చేరారు. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూడా విడాకుల బాట పట్టబోతున్నారని టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు