Sonudsood : రోటీపై ఉమ్మేసిన వ్యక్తి రాముడా? సోనూసూద్ కు ఇచ్చిపడేసిన కంగనా

Sonudsood : బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ ఎన్నో వేల మందికి హెల్ప్ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు ఈ హీరో వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే సాయం చేయడానికి ముందుండే సోనుసూద్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఏకంగా రోటీలపై ఉమ్మేసిన వ్యక్తికి సపోర్ట్ చేసి తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. పైగా అతడిని రాముడితో పోల్చడంపై సోషల్ మీడియాలో నెటిజెన్లు సోను సూద్ ను తిట్టిపోస్తున్నారు.

అసలు వివాదం ఏంటంటే…

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కన్వర్ యాత్రపై పోలీసులు పెట్టిన రూల్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఇలాంటి నిబంధనలు పెట్టడం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. ముజాఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్ర మార్గంలో ఉన్న షాపులు, హోటల్, ఇతర దుకాణాల యజమానులు వారి పేర్లను ప్రదర్శించాలని పోలీసులు చెప్పడం కాంట్రవర్సీకి దారి తీసింది. ప్రియాంక గాంధీ దీన్ని రాజ్యాంగ దాడిగా అభివర్ణించగా, ఇది దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష, హిట్లర్ నాజి రూల్స్ అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జావేద్ అక్తర్ లాంటివారు ఫైర్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోనుసూద్ షాపుల నేమ్ ప్లేట్ పై మానవత్వం మాత్రమే ప్రదర్శించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరో కొత్త వివాదానికి దారి తీశారు. ఆయన పోస్ట్ చూసిన ఓ నెటిజెన్ రిప్లైగా ఉమ్ము వేసి రోటిని తయారు చేస్తున్న యువకుడి వీడియోను పోస్ట్ చేశాడు. అయితే దానికి సోనూసూద్ శ్రీ రాముడికి శబరి ఎంగిలి పండ్లను ఇచ్చిందని గుర్తు చేస్తూ, నేను వీటిని ఎందుకు తినకూడదు సోదరా అంటూ తిరిగి ప్రశ్నించాడు. పైగా అహింస ద్వారానే హింసను జయించవచ్చు.. జై శ్రీరామ్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రొటీలు చేసే వ్యక్తి ఇతర మతాల వారిపై ద్వేషంతో ఇలా చేస్తున్నాడని, ఇలాంటి రొటీలను పార్సల్ చేసి సోనూసూద్ కు పంపించాలంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

Kangana Ranaut slams Sonu Sood for comparing food vendor spitting on food  to Shabri's Ramayana episode, 'Bollywood se ek aur...'

ఇచ్చి పడేసిన కంగనా…

సోనూసూద్ ట్వీట్ పై నటి, ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. దేవుడు, మతం గురించి తన వ్యక్తిగత పరిశోధనల ద్వారా సొంత రామాయణానికి దర్శకత్వం వహిస్తున్నాడు సోనూసూద్. వా క్యా బాత్ హై.. బాలీవుడ్ లో మరో రామాయణం అంటూ ఎద్దేవా చేసింది.

అసలు ఈ రూల్స్ ఎందుకు?

ఉత్తరప్రదేశ్ లో పోలీసులు ఇలాంటి రూల్స్ ను ఎందుకు పెట్టారానే విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్లారిటీ ఇచ్చారు. యాత్రికుల పవిత్రత, విశ్వాసాన్ని కాపాడేందుకే కన్వర్ యాత్ర జరిగే మార్గాల్లో ఫుడ్ అమ్మే దుకాణాల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఆదేశించినట్టుగా వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాంతి, భద్రతల సమస్యలు ఏర్పడకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నామని ముజాఫిర్ నగర్ పోలీసులు వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు