Ram Charan -Upasana Konidela: రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలుసు.. ఈమె పుట్టినరోజు నిన్న జరుపుకుంది.. 35 ఏటలోకి అడుగు పెట్టింది.. ఉపాసన రామ్ చరణ్ వైఫ్ గానే కాకుండా ఒక వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా తన భార్య ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ పిక్ షేర్ చేసి మెగా ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చారు రామ్ చరణ్.. సోషల్ మీడియాలో చరణ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
ఈ ఫొటోలో రామ్ చరణ్, ఉపాసనలు మాత్రమే ఉన్నారు.. ఉపాసన పుట్టినరోజు సందర్బంగా రామ్ చరణ్ ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.. అంతేకాదు తన భార్య పుట్టినరోజు సందర్బంగా అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఆమెకు ఖరీదైన డైమండ్ నెక్లేస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.. దాని ఖరీదు కోట్లల్లోనే ఉంటుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీన్ని బట్టి రామ్ చరణ్ కు ఎంత స్పెషలో తెలిసిపోతుంది.. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..
రామ్ చరణ్ పెళ్లికి ముందు ఓ లెక్క.. పెళ్లైన తరువాత మరోలెక్క అన్నట్టుగా తన అర్ధాంగి రాకతో రామ్ చరణ్ లైఫ్ పూర్తిగా మారిపోయిందను చెప్పొచ్చు. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతని కెరియర్ని బిల్డ్ చేసుకునే పాత్రల్ని ఇప్పుడు చేస్తూ వస్తున్నాడు.. అయితే పెళ్లి తరువాత రామ్ చరణ్.. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు.. ‘రంగస్థలం’ సినిమాతో ఇండస్ట్రీని ఏలే నటుడు తనలో ఉన్నాడని చెప్పకనే చెప్పాడు. రీసెంట్గా RRR సినిమాతో మరో మైల్స్టోన్ మూవీ అందుకుని ప్రశంసలు దక్కించుకున్నారు. తన విజయంలో తన భార్య పాత్ర కూడా ఉంటుందని గర్వంగా చెప్పుకుంటారు రామ్ చరణ్.. ఇప్పుడు క్లింకార వచ్చిన తర్వాత రామ్ చరణ్ తో పాటుగా మెగాస్టార్ ఫ్యామిలీ వరుస గుడ్ న్యూస్ లు వింటున్నారు..
View this post on Instagram
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ తర్వాత బుచ్చి బాబుతో ఓ సినిమా చెయ్యనున్నాడు.. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 సినిమా చెయ్యనున్నాడు..