Raayan PreRelease Event : తనకోసం రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమన్నాడు.. – సందీప్ కిషన్

Raayan PreRelease Event : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. పొంగల్ కి కెప్టెన్ మిల్లర్ తో యావరేజ్ హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు “రాయన్” సినిమాతో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కగా, కళానిధి మారన్ నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటినుండి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోగా, ట్రైలర్ తో స్కై లెవెల్లో క్రేజ్ ఏర్పడింది. ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తున్న ఈ సినిమా తన 50వ సినిమాగా తెరకెక్కడం జరిగింది. ఇదిలా ఉండగా రాయన్ ప్రీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ సినిమా ఈవెంట్ కి ధనుష్ సహా చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారు అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Sundeep Kishan Speech at Raayan PreRelease Event

తనకోసం రాసుకున్న క్యారెక్టర్ ఇది..

ఇక రాయన్ సినిమాలో సందీప్ కిషన్ కూడా ప్రత్యేక కీలక పాత్రలో నటించగా, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడం తన అదృష్టమని, నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ తో కలిసి నటించానని, అదే తనకు నేషనల్ అవార్డు పొందినంత గర్వాన్ని ఇచ్చిందని అన్నాడు. ఇక స్పీచ్ లో మాట్లాడుతూ…ధనుష్ ఈ సినిమాలో ఆయన కోసం రాసుకున్న క్యారెక్టర్ తనకు ఇచ్చారని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. అలాగే సందీప్ కిషన్ మాట్లాడుతూ… రేపు సినిమా రిలీజ్ అయ్యాక మీరందరు నా పాత్ర చూసి గర్వపడతారు.. ఒక తెలుగు కుర్రాడు తమిళ్ సినిమాలో ఇలాంటి పాత్ర చేశాడని… అని చెప్పుకొచ్చాడు. ఇక అలాగే ధనుష్ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాకు తాను 35 లక్షలు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

జులై 26న రిలీజ్…

ఇక రాయన్ సినిమాలో విలక్షణ దర్శక నటులు ఎస్.జె. సూర్య, సెల్వ రాఘవన్ కూడా కీలక పాత్రల్లో నటించగా, సందీప్ కిషన్, కాళిదాస్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ చిత్రంను జూలై 26, 2024 న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు