DilRaju : రాయన్ ముందు గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ చెప్పేసాడు..

DilRaju : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో ‘గేమ్ చేంజర్’ కూడా ఒకటి. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు మూడేళ్ళుగా కాచుకుని ఉన్నారు. RRR తరవాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. పైగా శంకర్ షణ్ముగం ఈ సినిమాని డైరెక్టర్ చేస్తుండడం, అలాగే ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం వల్ల గేమ్ ఛేంజర్ పై అభిమానులు భారీగా హోప్స్ పెట్టుకున్నారు. అయితే మూడేళ్ళుగా వాయిదా పడుతూ మరీ షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు.

 Dil Raju announced Game Changer releasing on Christmas

రాయన్ ముందుగా గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్..

ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొత్తం రీసెంట్ గా పూర్తి కాగా, చరణ్ లేని ఓ పది రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉందని శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ఇండియన్2 వల్ల గేమ్ ఛేంజర్ రిలీజ్ ని ఇప్పటివరకు వాయిదా వేస్తూ రాగా, ఇండియన్2 సినిమా విడుదల కావడమూ జరిగిపోగా, ఇప్పుడందరి దృష్టి గేమ్ ఛేంజర్ పైనే పడింది. కాగా ఇప్పుడు నిర్మాత దిల్ రాజు (DilRaju) ధైర్యం తెచుకున్నట్టున్నాడు. సినిమా రిలీజ్ అప్డేట్ చెప్పేసాడు. తాజాగా ధనుష్ నటించిన రాయన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు రాయన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. పనిలో పని గా గేమ్ ఛేంజర్ అని ఫ్యాన్స్ అడగగా, క్రిస్మస్ కి కలుద్దాం అంటూ… గేమ్ చేంజర్ ని క్రిస్మస్ కి తీసుకువస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు.

- Advertisement -

సోలో రిలీజ్ కి ప్లాన్…

ఇక గేమ్ ఛేంజర్ ని ముందుగా దీపావళి కి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండగా, దిల్ రాజు సోలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అందుకే క్రిస్మస్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా ముగించుకున్నాడు.. కాబట్టి త్వరలో బుచ్చిబాబు సినిమాలో బిజీ కానున్నాడు. ఇప్పుడు దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ చెప్పాడు కాబట్టి, ఇప్పటినుండే మూవీ ప్రమోషన్లు ఉంటాయని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు