Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి పిక్స్.. ఎవరంటే..?

Sai Dharam Tej.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కూడా ఒక ఇంటి వారు కాబోతున్నారు. త్వరలోనే ఆ హీరోయిన్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు మెహరీన్. మెహరీన్ – మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారట. దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో ఈ వార్త బాగా వినిపించింది. అయితే మెహరీన్ ప్రేమను సాయి ధరంతేజ్ ఒప్పుకోలేదని సమాచారం. అందుకే ఇద్దరూ డ్రాప్ అయ్యారు అని తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలుసుకున్నారని , అందుకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Sai Dharam Tej: Mega hero wedding pics with that heroine..Who is it..?
Sai Dharam Tej: Mega hero wedding pics with that heroine..Who is it..?

సాయి ధరమ్ తేజ్ ఎఫైర్ లిస్ట్..

సాయి ధరంతేజ్ విషయానికి వస్తే.. గతంలో హీరోయిన్ రెజీనాతో ఈయన లవ్ ట్రాక్ నడిపినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే తిక్క సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి తో కూడా ఎఫైర్ నడిపినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవేవి కూడా నిజం కాలేదు. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ మెహరీన్ తో పెళ్లికి సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే ఈ విషయంపై వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

సాయి ధరంతేజ్ కెరియర్..

యాక్సిడెంట్ ముందు వరకు ఒక కెరియర్, యాక్సిడెంట్ తర్వాత ఒక కెరియర్ అన్నట్టుగా ఈయన భవిష్యత్తు మారిపోయింది. యాక్సిడెంట్ జరగక ముందు వరకు పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఒక హిట్ కోసం పరితపిస్తున్నారు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఆ తర్వాత నటించిన బ్రో సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విరూపాక్ష 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు సాయి ధరంతేజ్.

- Advertisement -

మెహరీన్ కెరియర్:

మెహరీన్ విషయానికి వస్తే ప్రముఖ రాజకీయవేత్త భవ్య భిష్నోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక పెళ్లి పీటలు ఎక్కుతారని అనుకుంటుండగానే సడన్గా వీరి నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు .సినిమాలలో నటించకూడదు అని కండిషన్ పెట్టడం వల్ల ఈమె నిశ్చితార్థం బ్రేకప్ చేస్తుందని సమాచారం. భవ్య తో నిశ్చితార్థం బ్రేకప్ చేసుకున్న తర్వాత ఎఫ్ 3 సినిమాలో నటించింది .ఆ తర్వాత పలు చిత్రాలలో అవకాశాలు కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం గ్లామర్ ఫోటో షూట్లతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇలాంటి సమయంలోనే మెగా హీరోతో పెళ్లి పీటలెక్కబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే అటు సాయి ధరంతేజ్ ఇటు మెహరీన్ ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు