Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన చిరు.. పెద్ద కథే..,!

Chiranjeevi.. కొణిదెల చిరంజీవి స్వయంకృషితో ఎదిగి నేడు మెగాస్టార్ గా చలామణి అవుతూ.. అటు సినిమాలు..ఇటు స్వచ్ఛంద సంస్థలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కాకపోతే ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చిరంజీవి కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి..ప్రస్తుతం మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు ముందు ఈయన సినీ కెరియర్ ఒక రేంజ్ లో ఉండేది. ఎప్పుడైతే రీయంట్రీ ఇచ్చారో అప్పటినుంచి కథలు ఎంపిక విషయంలో కూడా తడబడుతున్నారు.పైగా రీమేక్ సినిమాలు చేయడం వల్ల ఒక్క బ్లాక్ బస్టర్ విజయం కూడా ఆయన ఖాతాలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా చలామణి అయ్యే ప్రయత్నాలు చేస్తుంటే చిరంజీవి మాత్రం హిట్టు కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి.

Chiranjeevi: Prabhas putting the director on the line.. is a big story..!
Chiranjeevi: Prabhas putting the director on the line.. is a big story..!

సందీప్ వంగాతో చిరంజీవి మూవీ..

ఈ క్రమంలోనే గత ఏడాది భోళా శంకర్ సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ ను మూటకట్టుకున్నారు. అందుకే రీమేక్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే బ్రో డాడీ సినిమా రీమేక్ చేయాలనుకున్న ఆలోచనలు కూడా విరమించుకున్నారు. చిరంజీవితో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు, ఒక ఫైట్ సినిమా మొత్తం పూర్తయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా చేయాలని ప్లాన్ లో ఉన్నారు చిరంజీవి. ఇప్పటికే సందీప్ రెడ్డి కూడా చిరంజీవి కోసం ఒక స్టోరీ సిద్ధం చేసి పెట్టారట.

ప్రభాస్ తో మూవీ ఆలస్యం అందుకే..

ఇదిలా ఉండగా మరోవైపు సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఆ లోపు చిరంజీవితో ఒక పవర్ఫుల్ మాస్ మూవీని చేయాలని సందీప్ రెడ్డి సిద్ధం అవుతున్నారట. అందుకే చిరంజీవి చేయాల్సిన సినిమాకు సంబంధించిన స్టోరీ తో పాటు ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. ఇక చిరంజీవి ఓకే చెబితే సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -

ప్రభాస్ సినిమాలు..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా తో చేయాల్సిన స్పిరిట్ మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే కల్కి పార్ట్ 2 తో పాటు, హను రాఘవపూడి తో ఫౌజీ సినిమా, ది రాజా సాబ్ సినిమాలు కూడా లైన్లో పెట్టారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప సినిమాల్లో కూడా ప్రభాస్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ది రాజా సాబ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు ఇక ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉన్న నేపథ్యంలో సందీప్ ఈ గ్యాప్ ను ఫిల్ చేసుకోవడానికి చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి చిరంజీవి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు