Charmie – Jani Master : జానీ మాస్టర్ తో చార్మీ గొడవ.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Charmie – Jani Master : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా డిమాండ్ ఉన్న డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లలో జానీ మాస్టర్ కూడా ఒకరు.. ఆయన స్టార్ హీరోలతో స్టెప్పులు వేయిస్తున్నారు.. ఆయన కంపోజ్ చేసే కొన్ని స్టెప్స్ ఎంతగా పాపులర్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక అలాగే మాస్టర్ స్టెప్పులే కాదు.. మాటలు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి.. మొన్న ఓ డ్యాన్సర్ తో గొడవ పెట్టుకున్నాడని వార్తలు నెట్టింట వినిపించాయి.. తాజాగా ఓ హీరోయిన్ తో గొడవ పడినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఆ గొడవకు కారణం ఏంటనేది ఇన్నాళ్లకు బయట పడింది..

తెలుగులో ఒకప్పుడు ఓ ఊపేసిన హీరోయిన్ చార్మీ గురించి అందరికీ తెలుసు.. ఆమె ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు కానీ సినిమాలను నిర్మిస్తున్నారు.. గతంలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.. ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు చార్మీ, జానీ మాస్టర్ మధ్య గొడవలు జరిగినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..

Charmie's fight with Jani Master.. The truth that has been revealed for days.
Charmie’s fight with Jani Master.. The truth that has been revealed for days.

అసలేం జరిగిందంటే.. డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి ‘మార్ ముంతా చోడ్ చింతా ‘ అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ సాంగ్ నెట్టింట వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఆ పాట కోసం 200 మంది డ్యాన్సర్స్ ను కావాలని జానీ మాస్టర్ అడిగారట.. అయితే దానికి చార్మీ మాత్రమే అంత మంది అంటే నేను భరించలేను ఒక వందమందిని తగ్గించాలని అడిగారట.. 110 మందికి పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. 110 మంది డ్యాన్సర్లను తీసుకోవాలనుకున్న టాలీవుడ్‌ డ్యాన్సర్ల యూనియన్‌లో ఓ రూల్ ఉందని.. ఎక్కువ మంది డ్యాన్సర్లుగా తెలుగువాళ్లని పెట్టుకోవాలని .. అది కూడా హైదరాబాద్ నుంచి రప్పించాలని ఛార్మికి చెప్పానని జానీ మాస్టర్ పేర్కొన్నారు.. అయితే తర్వాత కొన్ని జరిగాయని ఆ తర్వాత ముంబై వాళ్లనే పెట్టుకున్నారని సమాచారం.. దీనివల్లనే ఛార్మి, మాస్టర్ కు మాటలు లేవని వార్తలు వస్తున్నాయి.. ఇక సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.. విడుదల తర్వాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు