Actor Kashi Vishwanath : ఈ నటుడు ఓ కల్ట్ సినిమాకు డైరెక్టర్ అని మీకు తెలుసా…?

Actor Kashi Vishwanath : ప్రముఖ నటుడు యానమదల కాశీ విశ్వనాధ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చాలా సినిమాల్లో ఈయన హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రలో కనిపించారు.. డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన నచ్చావులే సినిమాలో హీరో తండ్రిగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతోనే ఆయన నటుడిగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.. ఇప్పటివరకు ఎన్నో వందల సినిమాల్లో నటించాడు.. ఎన్నో అవార్డులు అందుకున్నారు.. అయితే ఆయన నటుడుగానే అందరికీ పరిచయం.. కానీ ఈయన ఓ సినిమాకు డైరెక్టర్ గా చేశారు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం..

ఈయన సినిమాల్లో నటుడుగా చెయ్యకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసారు.. విశ్వనాధ్ సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా.. వంటి సినిమాలకు కో డైరెక్టర్ గా చేశారు.. ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. అయితే ఈయన డైరెక్టర్ గా ఓ కల్ట్ సినిమా చేశాడు.. ఆ సినిమా నువ్వు లేక నేను లేను.. ఆ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది.

Nuvvu Leka nenu Lenu movie directed by actor Kashi Vishwanath?
Nuvvu Leka nenu Lenu movie directed by actor Kashi Vishwanath?

ఈ మూవీలో లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేశారు. అలాగే లయ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ అందమైన ప్రేమ కథకు వై. కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో, డి. రామానాయుడు సమర్పణలో నిర్మించారు.. అప్పటిలో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా, కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది.. అతని కేరీర్ లో ఇది బెస్ట్ సినిమా.. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన తొలిచూపు లోనే సినిమా చేశాడు.. ఈ సినిమా తర్వాత ఆయన పెద్దగా సినిమాలను తెరకేక్కించలేదు.. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు