OTT Movie : ఓటిటిని ఊపేస్తున్న హారర్ మూవీ… ఆ 4 రోజులు మగవాళ్ళకు దబిడిదిబిడే

OTT Movie : దెయ్యాలు నిజంగా ఉన్నాయా అంటే అది సమాధానం లేని ప్రశ్న. నమ్మే వాళ్ళు ఉన్నాయి అని వాదిస్తే, నమ్మని వాళ్ళు చూపించమని వాదిస్తారు. ఇలా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఈ హారర్ సినిమాలు థియేటర్లలో మాత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తాయి. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఒకటే అయినప్పటికీ మేకర్స్ వారి క్రియేటివిటీని ఉపయోగించి తీసే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. వాటిని చూస్తే నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అని భయం వేయడమే కాదు, ఒక్కోసారి ఆ దయ్యాల బ్యాక్ గ్రౌండ్ స్టోరీ తెలిస్తే బాధగా కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడో జరిగిందానికి పగ, ప్రతీకారం అంటూ రగిలిపోతూ ఉంటాయి కొన్ని దెయ్యాలు. ఈరోజు కూడా మనం చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ దెయ్యం కేవలం మగవాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి ఆడుకుంటుంది. అసలు ఈ సినిమా ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనేది చూసేయండి.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ రియల్ స్టోరీ లాంటిదే. కొన్నేళ్ళ క్రితం ఓ స్త్రీ రేపు రా అనే పదం ఎంత హడల్ పుట్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే స్టోరీ లైన్ తో స్త్రీ అనే సినిమాను తెరకెక్కించారు బాలీవుడ్ మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లోనే జరుగుతుంది.

Stree

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ విలేజ్ లో విక్కీ అనే టైలర్ తన తండ్రితో కలిసి ఉంటాడు. తల్లి చనిపోవడంతో తండ్రి అతన్ని గారాబంగా చూసుకుంటాడు. అయితే అదే ఊళ్లో ఓ ఆత్మ మగవారిని వేధిస్తుంది. కరెక్ట్ గా ఏడాదిలో ఓ సందర్భంలో నాలుగు రోజులు పాటు జరిగే పండగ జరుగుతుంది. అదే సమయంలో ఒంటరిగా మగవాళ్ళు కన్పిస్తే చాలు వాళ్లను ఎత్తుకెళ్లిపోతుంది. దీంతో ఆ ఊరి వాళ్ళు తమ ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకుంటారు. ఇక ఎప్పటిలాగే ఆ ఏడాది కూడా ఆ పండగ రావడంతో భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు జనాలు. అయితే మరోవైపు విక్కీ రమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ కరెక్ట్ గా పండగ రోజు రాత్రి విక్కి తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటాడు. తండ్రి హెచ్చరించినా వినకుండా విక్కీ ఈ పార్టీకి వెళ్తాడు. దీంతో అనుకున్నంత పని అయిపోతుంది. ఆ ఫ్రెండ్స్ లో ఒకరిని దయ్యం ఎత్తుకెళ్లిపోతుంది. ఇక మరోవైపు రమ్య విక్కీ చేత తనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటుంది. కానీ విచిత్రంగా ఆమె ఎవరికీ కనిపించదు. దీంతో అందరికీ రమ్యనే ఆ దయ్యమా అనే అనుమానం కలుగుతుంది. ఇంతకీ ఈ దయ్యం ఎవరు? ఇలా మగవాళ్ళను మాత్రమే అది టార్గెట్ చేయడం వెనుక ఉన్న స్టోరీ ఏంటి? మరి రమ్య నిజంగానే దయ్యమా? అనే విషయాలు తెలియాలి అంటే స్త్రీ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు