Suriya44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య స్పెషల్ అప్పీరెన్స్ ఉన్న సినిమాలే చేయగా, ET తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తుంది “కంగువ” లోనే. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే. సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక సూర్య తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. సూర్య తన 44వ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి కార్తీక్ తో సినిమా చేస్తుండగా, యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లో చిత్రీకరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినిమా స్టార్ట్ చేసినపుడే సూర్య పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసారు. తాజాగా సూర్య 49వ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ సూర్యని గ్యాంగ్‌స్టర్ అవతార్ లో చూపిస్తూ ఒక స్పెషల్ టీజర్‌ను విడుదల చేశారు.
ఊర మాస్ గా సూర్య…
అర్ధరాత్రి సూర్య44 కి సంబంధించి స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక సూర్య44 టీజర్ లో “సముద్రంలో ఎక్కడో” అనే టెక్స్ట్‌తో ప్రారంభమైన వీడియో క్లిప్‌ను షేర్ చేసారు. ఆ టీజర్ లో ఒక “రాయల్ ఎస్టేట్” అని గుర్తు పెట్టబడిన ప్రదేశంలో గూండాలు నిలబడి ఉండగా, “ఒక ప్రేమ, ఒక నవ్వు, ఒక యుద్ధం.. ఒకరి కోసం వేచి ఉంది… ఇంగ్లీష్ లో చూపిస్తూ.. మెల్లిగా సూర్య ని స్లో మోషన్ లో స్టైలిష్ గా చూపిస్తారు. అలా తన గ్యాంగ్ తో నడిచొస్తూ ఉంటే మరో రోలెక్స్ గుర్తుకొస్తాడు. ముఖం మీద రక్తంతో, తుపాకీని పట్టుకుని స్క్రీన్ ముందు కనిపిస్తాడు. ఇక ఈ స్పెషల్ వీడియోని మేకర్స్ సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ తమ ట్విట్టర్ లో రిలీజ్ చేసారు. అర్థరాత్రి 12:12 గంటలకు ఈ స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా…
ఇక సూర్య44 (Suriya44) సినిమా ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండగా, సూర్య కి సంబంధించి ఇంతకు ముందే ఒక రెట్రో లుక్ ను రిలీజ్ చేయగా, ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ తో మరింత హైప్ పెంచేశారు. ఈ చిత్రంలో సూర్య పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. జాకీ ప్రొడక్షన్ డిజైనర్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమాను సూర్య యొక్క స్వంత నిర్మాణ సంస్థ అయిన ‘2D ఎంటర్టైన్మెంట్’ ద్వారా సూర్య – జ్యోతిక కలిసి నిర్మిస్తున్నారు.