Nayanthara : దర్శకుడుగా మారిన లిరిసిస్ట్ , కెవిన్ సరసన నయన్

Nayanthara : ప్రస్తుతం ఉన్న తమిళ్ యంగ్ హీరోస్ లో కెవిన్ ఒకరు. మొదట టెలివిజన్ లో తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కెవిన్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లిఫ్ట్ మరియు దాదా సినిమాలు కెవిన్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు లాగానే బాగా కష్టపడి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. శివ అరవింద్ దర్శకత్వం వహించిన “నటపున ఎన్నన్ తెరియుమా”అనే సినిమాతో డెబ్యు హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు.

వినీత్ వరప్రసాద్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన లిఫ్ట్ అనే సినిమాలో కెవిన్ లీడ్ రోల్ కనిపించాడు. ఈ సినిమా నేరుగా హాట్స్టార్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాతోనే వినీత్ వరప్రసాద్ డెబ్యూ డైరెక్షన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిలిం దాదా. ఈ సినిమాను గణేష్ కే బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక రీసెంట్ గా స్టార్ అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కెవిన్.

Nayanthara

- Advertisement -

ఇక ప్రస్తుతం కి కెవిన్ నయనతారతో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే విష్ణు లిరిసిస్ట్ గా లియో , విక్రమ్ , దేవర వంటి తమిళ్ సినిమాలకు పనిచేశాడు. ఈ సినిమా షూటింగు మొదలైంది. నయన్ తో కలిసి ఉన్న ఫోటో ను కెవిన్ షేర్ చేసాడు. ఇకపోతే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు