Raj Tarun – Lavanya : ఈ జంటకు మూడేళ్ల కూతురు కూడా ఉందా.. ఈ ట్విస్ట్‌లు భరించలేం రా బాబూ..!

Raj Tarun – Lavanya.. ప్రముఖ హీరో రాజ్ తరుణ్ ఆయన ప్రేయసి లావణ్య కేసులో రోజుకొక ట్విస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు సినిమా కథను తలపిస్తున్న ఈ స్టోరీని వింటుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీరికి సంబంధించిన రోజుకొక విషయం పై ట్విస్ట్ ఇస్తుంటే.. ఈ ట్విస్టు లిమేం భరించలేం రా బాబు అంటూ అభిమానులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇక పక్కా ప్లానింగ్ తో రోజుకొక విషయాన్ని బయటకు తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న లావణ్య గురించి కూడా పలు వార్తలు వైరల్ అవ్వడం గమనార్హం..

Raj Tarun - Lavanya : Does this couple also have a three year old daughter.. I can't bear these twists Raa Babu..!
Raj Tarun – Lavanya : Does this couple also have a three year old daughter.. I can’t bear these twists Raa Babu..!

రాజ్ తరుణ్ – లావణ్య జంటకు మూడేళ్ల కూతురు..

ఇదిలా ఉండగా తాజాగా మరొక వార్త వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ కారణంగా లావణ్యకి మూడు సంవత్సరాల కూతురు పుట్టిందనే వార్త తెరపైకి రాగా.. ఈ విషయం తెలిసిన చాలామంది నిజంగానే రాజ్ తరుణ్ , లావణ్య కు కూతురు ఉందా..? ఉంటే ఇన్ని రోజులు ఆ పాపను ఎక్కడ దాచిపెట్టారు ..? అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ క్లారిటీ..

దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ.. లావణ్య పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేస్తోంది. ఆమె ముందుగానే ఒక్కొక్క విషయాన్ని ఒక్కో సమయంలో బయట పెట్టాలి అని స్కెచ్ వేసుకుంది కూడా. ఇక ఆ ప్రకారమే అన్ని బయటకు తీసుకొస్తుంది.. అలా మొదటి రోజు రాజ్ తరుణ్ గురించి కామెంట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ మాల్వీ మల్హోత్రా గురించి తెలిపింది.ఇందులో భాగంగానే మాల్వి మల్హోత్రా పై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి కూడా కేసు పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ వల్ల రెండు సార్లు అబార్షన్ అయిందని ఆధారాలతో సహా బయట పెట్టింది.. అంతేకాదు అబార్షన్ చేయించుకుంటానని చె
ప్పి, పోలీసులకు సమాచారం కూడా అందించింది ఇలా రోజుకొక పని చేస్తూ మీడియాలో హైలెట్ అవ్వాలని చూస్తోంది. రాజ్ తరుణ్ మాత్రం లావణ్య టార్చర్ తట్టుకోలేక అలాంటి పని చేస్తున్నాడు అంటూ దాసరి విజ్ఞాన్ వెల్లడించారు.

- Advertisement -

లావణ్య పై అనుచిత వ్యాఖ్యలు..

మరొకవైపు రాజ్ తరుణ్ లాగే మల్హోత్రా కూడా యోగేష్ వల్ల ఇబ్బంది పడిన బాధితురాలే. అలా వీరిద్దరూ ఒక సినిమా సమయంలో ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఫ్రెండ్స్ అయ్యారు.. కానీ దీనిని అసలు ఓర్వలేకపోయింది లావణ్య. అందుకే వీరిద్దరి మధ్య అడ్డుకట్ట వేయాలని అందులో భాగంగానే ఇలాంటి కామెంట్ చేసింది.. లావణ్య మస్తాన్ వంటి వ్యక్తితో తిరగగా లేనిది రాజ్ తరుణ్ ఇంకొక అమ్మాయితో తిరిగితే తప్పొచ్చిందా. ఇక లావణ్య కు రెండుసార్లు అబార్షన్ అవడమే కాదు మూడేళ్ల పాప ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ రూమర్లు మాత్రమే ఇందులో ఏ మాత్రం నిజం లేదు లావణ్య ఒక అబద్ధాల కోరు అంటూ ఆమెపై సంచలన కామెంట్లు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు