Tarun : ఒకప్పుడు లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచుకున్న స్టార్ హీరో తరుణ్ గురించి అందరికీ తెలుసు.. అప్పటిలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తరుణ్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.. కనీసం సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నాడన్నా విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఆయన అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఆ వ్యాధి కారణంగానే ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అసలు మ్యాటరేంటో వివరంగా తెలుసుకుందాం..
ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో తరుణ్. కెరీర్ ప్రారంభంలో వరుసగా లవ్ స్టోరీస్ చేసి విజయాలు అందుకున్నాడు. ఆ సినిమాలు బాగా హిట్ అవ్వడంతో లవర్ బాయ్ అనే పేరును అందుకున్నాడు.. అయితే ఆ ఇమేజ్ నుంచి బయటపడలేకపోయాడు. వరుసగా అలాంటి సినిమాలే చేయడంతో తరుణ్ అంటే లవర్ బాయ్ అనే ట్యాగ్ ఫిక్స్ అయిపోయింది. అదే కెరీర్ని దెబ్బకొట్టింది.. ఆయనకు ఆ సినిమాలు తప్ప యాక్షన్, మాస్ సినిమాలు చేస్తే జనాలు పెద్దగా ఆదరించలేదు.. ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు..
ఆ తర్వాత తన తండ్రి వ్యాపారాలను చూసుకొనేవాడు.. అప్పుడు సినిమాలు లేవని డిప్రెషన్ లోకి వెళ్లి అరుదైన వ్యాధి బారిన పడినట్లు అప్పట్లో వార్తల్లో గుప్పుమన్నాయి.. కానీ తాను ఏ జబ్బుతో పోరాడలేదు అని క్లారిటి ఇచ్చాడు.. అయినా ఇప్పటికి ఆ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తరుణ్ పెళ్లి పై కూడా అనేక వార్తలు వినిపించాయి.. దాని పై కూడా తరుణ్ క్లారిటి ఇచ్చాడు.. ఇకపోతే తరుణ్ లేటెస్ట్ లుక్ ఫోటోలు ఈ మధ్య వైరల్ అయ్యాయి.. అంతేకాదు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు టాక్.. మరి ఎలాంటి కథతో వస్తాడు.. ఏ డైరెక్టర్ తో రీ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి…